Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లారీని ఢీకొట్టిన కత్తి మహేష్ కారు.. తప్పిన ప్రమాదం

Advertiesment
Kathi Mahesh
సినీ నటుడు, ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్‌కు పెను ప్రమాదమే తప్పింది. కత్తి మహేష్‌ ప్రయాణిస్తోన్న కారు ముందుగా వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ఈ ప్రమాదం శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం జాతీయరహదారిపై ముందు వెళుతున్న లారీని కత్తి మహేష్‌ ఇనోవా కారు ఢీకొట్టింది.
 
ఈ ఘటనలో కత్తి మహేష్‌కి స్వల్ప గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ప్రస్తుతం నెల్లూరు మెడికేర్ హాస్పటల్లో కత్తి మహేష్ చికిత్స పొందుతున్నారు. అయితే.. ఈ ఘటనలో కత్తి మహేష్‌ కారు నుజ్జు, నుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ‌బుల్ గేమ్ ఆడేవారే వ‌ల్లే `మా`కు చెడ్డ‌పేరు