Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pokiri: పోకిరి కోసం ముందుగా మహేష్‌ను అనుకోలేదట.. రవితేజను?

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (14:58 IST)
Pokiri: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ మహేష్ బాబు ఈ సినిమా చేయడం ఇష్టం లేదు. మరి ఈ సినిమాను తిరస్కరించిన హీరో ఎవరు? మరి ఎందుకు రిజెక్ట్ చేశారో తెలుసుకుందాం.. మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా ఇండస్ట్రీలో హిట్ అయ్యి మహేష్ కెరీర్‌ని మలుపు తిప్పింది.
 
అయితే ఈ సినిమా కోసం అనుకున్న వ్యక్తి మహేష్ బాబు కాదు. ఈ సినిమా కథను పూరి జగన్నాథ్ మరో హీరోకి చెప్పాడట. మరి ఆ హీరో ఎవరంటే రవితేజ.. పూరీ జగన్నాథ్, రవితేజ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ ఉద్దేశంతోనే పోకిరి సినిమాలో రవితేజని హీరోగా ఊహించుకుని కథ రాసుకున్నాడు. 
 
అయితే చివరికి రవితేజ సినిమా చేసే పరిస్థితి లేకపోవడంతో మహేష్‌కి కథ చెప్పడంతో కథ నచ్చిన మహేష్ అంగీకరించాడు. కానీ మహేష్ దగ్గరకు కథ రాగానే కొన్ని మార్పులు చేసి సినిమా తీశారు. రవితేజతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నప్పుడు సన్నాఫ్ సూర్య, ఉత్తమ్ సింగ్ అనే టైటిల్స్ అనుకున్నాడట దర్శకుడు. 
 
అయితే మహేష్ బాబు టైంలో టైటిల్ మార్చారు. అంతే కాకుండా ఈ సినిమాలో ఇలియానా కంటే ముందు అయేషా టకియా, కంగనా రనౌత్ లను హీరోయిన్స్‌గా అనుకున్నారు కానీ డేట్స్ కుదరకపోవడంతో చివర్లో ఇలియానానే ఫిక్స్ చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. 
 
ఒకవేళ రవితేజ ఈ సినిమా చేసి ఉంటే.. అతని కెరీర్ మరింత బాగుండేదని మాస్ మహారాజా అభిమానులు భావించారు. కానీ రవితేజ బ్యాడ్ లక్ సినిమాను రిజెక్ట్ చేసాడు కానీ మహేష్ బాబు ఈ సినిమా చేసి స్టార్ హీరోగా ఎదిగాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments