Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు భారీ చిత్రాలకు సంతకం చేసిన త్రిష

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:34 IST)
చెన్నై చిన్నది త్రిష అందం తరగనిది. పీఎస్ సినిమాతో ఆమె దశ తిరిగింది. ఇంకా త్రిష కెరీర్ కొత్త మలుపు తిరిగింది. మణిరత్నం "పిఎస్" చిత్రాల భారీ విజయం అనంతరం.. ఆమె కోసం దర్శకులు పడిగాపులు కాస్తున్నారు. 
 
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న"లియో"లో త్రిష నటిస్తోంది. ఇందుకు సంబంధించి త్రిష షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది. అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రంలో ఆమె విజయ్‌తో కలిసి నటించింది. 
 
ఇంతలో, ఆమె మరో రెండు కోలీవుడ్ పెద్ద ప్రాజెక్ట్‌లకు సంతకం చేసింది. ప్రముఖ దర్శకులతో రెండు సినిమాలకు ఆమె సైన్ చేసింది. తాజా త్రిష "విడా ముయర్చి"లో అజిత్ కుమార్‌కి జోడీగా కనిపించనుంది. 
 
ఆపై మణిరత్నం కొత్త చిత్రంలో కమల్ హాసన్ సరసన కూడా కనిపిస్తుంది. కాగా 40 ఏళ్ల వయస్సులో, త్రిష కథానాయికగా తన సత్తా చూపిస్తోంది. సౌత్ ఇండియన్ సినిమాలో కొత్త ట్రెండ్‌కి నాంది పలికింది. ఆమెకు పీఎస్ సినిమా తర్వాత ఆఫర్లు భారీగా వెతుక్కుంటూ వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చాక్లెట్ ఆశ చూపి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం...

వారి ప్రేమకు పెద్దలు నో చెప్పారు.. అంతే భవనంపై నుంచి దూకేశారు..! (video)

మహిళా కానిస్టేబుల్ హత్య : తమ్ముడు అరెస్టు

కేరళలో హై అలర్ట్.. భారీ వర్షాలు... అయ్యప్ప భక్తులు బురదలో ప్రయాణం..

మరుగుదొడ్లు శుభ్రం చేయాలంటూ పంజాబ్ మాజీ సీఎంకు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments