Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ... 19 నుంచి 'అతిథి' వెబ్ సిరీస్

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (08:21 IST)
టాలెంటెడ్ యాక్టర్ వేణు తొట్టెంపూడి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ 'అతిథి'. ప్రముఖ ఓటీటీ కంపెనీ డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్‌గా ఈ వెబ్ సిరీస్ రాబోతోంది. 'అతిథి' వెబ్ సిరీస్‌ను రాండమ్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానరుపై దర్శకుడు భరత్ వైజీ రూపొందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నారు.
 
"అతిథి" వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తే... ఒంటరిగా పెద్ద భవంతిలో ఉంటున్న వేణుకు దెయ్యాలంటే నమ్మకం ఉండదు. ఎక్కడో ఒక ఆడది దెయ్యంగా మారిందని, అమ్మాయిలందరూ దెయ్యలంటే ఎలా అని అడుగుతాడు. మీ ఇంట్లో ఉన్నది మనిషి కాదు దెయ్యం అని తన మిత్రుడు చెప్పినా నమ్మడు. కానీ ఆ అమ్మాయి వింతగా ప్రవర్తిస్తుంటుంది. ఇంతకీ ఆమె ఎవరు?, మనిషా? దెయ్యామా? అనేది సిరీస్‌లో చూడాలి. మేకింగ్ క్వాలిటీ, యాక్టర్స్ పర్ ఫార్మెన్స్, ట్రైలర్‌లో ట్విస్ట్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని కథలు మొదలుపెట్టడం సులువు, ముగించడం కష్టం, కథలకు ముగింపు ఇద్దామా అనే డైలాగ్స్ 'అతిథి'పై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
 
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ఈ నెల 19 నుంచి 'అతిథి' వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ నుంచి వచ్చిన సేవ్ ది టైగర్స్, సైతాన్, దయ వంటి సిరీస్‌లు సూపర్ హిట్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'అతిథి'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే మొదలయ్యాయి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments