Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్వీన్ తమిళ్ రీమేక్ చిత్రంలో త్రిష ... నయనతార పోటీ నుంచి తప్పుకున్నట్టేనా?

కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'క్వీన్' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమాను దక్షిణాదిన తెరకెక్కించేందుకు.. తమిళ నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ అప్పట్లోనే ఈ మూవీ రీమే

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (15:05 IST)
కంగనా రనౌత్ హీరోయిన్‌గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'క్వీన్' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. దీంతో ఈ సినిమాను దక్షిణాదిన తెరకెక్కించేందుకు.. తమిళ నటుడు, దర్శకనిర్మాత త్యాగరాజన్ అప్పట్లోనే ఈ మూవీ రీమేక్ రైట్స్‌ని దక్కించుకున్నాడు. హీరోయిన్ రేవతి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి మరో సీనియర్ నటి సుహాసిని మణిరత్నం సంభాషణలు అందిస్తున్న సంగతి తెలిసిందే.
 
అయితే ఈ రీమేక్‌లో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపించినప్పటికీ.. ఇటీవల వరుసగా లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మెప్పిస్తున్న నయనతార దాదాపుగా కన్ఫమ్ అయిపోయిందనుకున్నారు. కానీ ఉన్నట్టుండి ఏమైందోగాని తమిళ రీమేక్‌లో టాలీవుడ్ బ్యూటీ త్రిషను దర్శకనిర్మాతలు ఎంపిక చేశారు. 
 
తెలుగు, తమిళ భాషల్లో త్రిషకు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఈ సినిమాను రెండు భాషల్లోనూ నిర్మించబోతున్నాడట త్యాగరాజన్. 'నాయకి' చిత్రాన్ని పూర్తిచేసిన త్రిష.. 'మోహిని' అనే టైటిల్‌పై లేడీ ఓరియెంటెడ్ పిక్చర్‌తో పాటు మరో సినిమాను కూడా ఒప్పుకుందట. ప్రస్తుతం చేస్తున్న రెండు ప్రాజెక్టులపై క్లారిటీ రాగానే.. ఈ ప్రాజెక్టు గురించి అందరికి తెలియజేస్తానంటోందీ ముద్దుగుమ్మ. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి చేసుకునేందుకు మండపానికి గుఱ్ఱంపై ఊరేగుతూ వచ్చిన వరుడు, ఎదురుగా వధువు శవం

తెలంగాణాలో మద్యం బాబులకు షాకిచ్చిన సర్కారు!!

చీటీ డబ్బుల కోసం ఘర్షణ : ఇంటి యజమానురాలి తల్లి వేలు కొరికిన వ్యక్తి!!

బాంబు పేలుళ్లకు కుట్ర- భగ్నం చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు

ప్రాణభయంతో దాక్కుంటున్న లష్కరే తోయిబా ఉగ్రవాదులు, ఒకణ్ణి చంపేసారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments