Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

ఠాగూర్
మంగళవారం, 1 ఏప్రియల్ 2025 (08:27 IST)
చిత్రపరిశ్రమలో చెన్నై చంద్రంగా గుర్తింపు పొందిన హీరోయిన్ త్రిష. ఐదేళ్ల క్రితం కెరీర్‌పరంగా పనైపోయిందనే ప్రచారం సాగింది. ఇక ఆమె నటనకు గుడ్‌బై చెప్పేయడం బెటర్ అనే మాటలు వినిపించాయి. కానీ, మణిరత్నం దర్శకత్వం వహించిన "పొన్నియిన్ సెల్వన్" చిత్రంలో తిరిగి తారాపథంలో దూసుకెళుతున్నారు. ఈ చిత్రం తర్వాత త్రిష కోలీవుడ్‌లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. 
 
విజయ్, అజిత్ వంటి అగ్రహీరోలతో ఏకంగా నాలుగు చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో జోరుగా సాగుతోంది. దీనికి కారణం కూడా త్రిషనే. తన ఇన్‌స్టాఖాతాలో ఆమె పెట్టిన ఓ పోస్ట్ ఇపుడు వైరల్‌గా మారింది. 
 
ఆకుపచ్చ రంగు చీరలో ఒంటి నిండుగా బంగారు ఆభరణాలతో, చేతికి ఉంగరం ధరించి ఉన్న త్రిష ఫోటో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి ప్రేమ ఎల్లపుడూ గెలుస్తుంది అనే క్యాప్షన్ జతచేసింది. దీంతో ఆమె ప్రేమలోపడిందనే, మనసిచ్చిన వాడిని మనువాడడానికి సిద్ధమవుతున్నదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. త్రిష ముఖంలో పెళ్లి కళ కనిపిస్తుందని ఆమె ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోతున్నారు. మరికొందరైతే.. ఏకంగా ఆమె నిశ్చితార్థం చేసుకుందేమో అనే సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా త్రిష పెట్టిన ఆ ఫోటో ఆమె పెళ్లిపై పలు రకాలైన పుకార్లకు దారితీసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 3.5గా..?

వేసవిలో వేడిగాలులు... ఈ సమ్మర్ హాట్ గురూ... బి అలెర్ట్.. 10 వేడిగాలులు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments