Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ ట్రిపుల్ రోల్.. తమన్నా పవర్ పనిచేయలేదు.. పెళ్లి చేసేసుకుంటా బాబోయ్!

తన పెళ్లిపై రకరకాల వదంతులు వస్తున్నాయని... బాహుబలి సినిమా సమయంలో తనపై చాలా వదంతులు వచ్చాయని.. వాటిని ఆపేందుకైనా వివాహం చేసుకోవాలని హీరో ప్రభాస్ అన్నాడు. ‘బాహుబలి- ది కన్‌క్లూజన్’ విడుదలకు ముందు హీరో ప

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (11:30 IST)
తన పెళ్లిపై రకరకాల వదంతులు వస్తున్నాయని... బాహుబలి సినిమా సమయంలో తనపై చాలా వదంతులు వచ్చాయని.. వాటిని ఆపేందుకైనా వివాహం చేసుకోవాలని హీరో ప్రభాస్ అన్నాడు. ‘బాహుబలి- ది కన్‌క్లూజన్’ విడుదలకు ముందు హీరో ప్రభాస్ తన పెళ్లి గురించి పెదవి విప్పారు. పెళ్లి అనగానే రానా, నేను అనుకున్న జోక్ ఒకటి గుర్తొచ్చింది. 
 
తమన్నా ఎవరితో అయితే ఫస్ట్ టైం చేసిందో ఆయా స్టార్స్ అందరికీ తదుపరి సంవత్సరం పెళ్లి అయిపోయింది. అలా తమిళంలో ఆర్టిస్టులకి, చరణ్‌కి, అందరికీ పెళ్లైపోయింది.  కట్ చేస్తే నాకు ఒక్కడికే తమన్నాతో రెండు సినిమాలు నటించినా పెళ్లి కాలేదు. అంటే తమన్నా పవర్ కూడా నాపై పని చేయలేదు... అంటూ ప్రభాస్ చెప్పారు. ఇంకా చెప్పాలంటే.. పవర్ రివర్స్ అయి ఆమెకు పెళ్లవుతుందో ఏమోనని ప్రభాస్ వ్యాఖ్యానించాడు.
 
ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా విశేషాల గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని నన్ను ఎంతోమంది అడిగారు. నేను వాళ్లకి చెప్పేసినా ఎగ్జైట్ కారు. తెరపై చూడాల్సిందేన’ని అన్నారు. బాహుబలి రెండు భాగాల్లో శివుడు, అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి మూడు పాత్రలు చేశానని, శివుడి పాత్ర ఈజీగా చేశానని, మిగతా రెండు పాత్రల్లో పరిధి మేరకు నటించానని చెప్పుకొచ్చారు. 
 
ఐదేళ్ల ముందు రాజమౌళి బాహుబలి కథ చెప్పినప్పుడే సినిమా స్థాయి ఏమిటో ఏమిటో ఊహించానని, సెకండ్ పార్ట్ కోసం ప్రేక్షకులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారని ప్రభాస్ తెలిపారు. ‘నాకింకా బాహుబలి 2 సెట్ ‌నుంచి బయటకు రానట్లే ఉంది. ఈ ఫీలింగ్ నుంచి బయటకు రావాలంటే సినిమా విడుదలవ్వాలమో’ అని వ్యాఖ్యానించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments