Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 'బాహుబలి'లాంటి చిత్రం చేయను... అలాకాకుంటే నిర్మాతలు నష్టపోతారు : ప్రభాస్

అమరేంద్ర బాహుబలి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 28వ తేదీన 'బాహుబలి-2' రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్ర యూనిట్ మునిగిపోయివుంది. ఈ నేపథ్యంలో సినిమాలో యాంగ్రీగా కనిపించే ప్రభాస్ ఇక్

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (10:48 IST)
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈనెల 28వ తేదీన 'బాహుబలి-2' రిలీజ్ కానుంది. దీంతో ఈ చిత్రం ప్రమోషన్లలో చిత్ర యూనిట్ మునిగిపోయివుంది. ఈ నేపథ్యంలో సినిమాలో యాంగ్రీగా కనిపించే ప్రభాస్ ఇక్కడ మీడియా వారు ఎలాంటి ప్రశ్నలు అడిగినా చాలా కూల్‌గా సమాధానం ఇస్తున్నారు.
 
తాజాగా మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ప్రభాస్ సమాధానమిస్తూ... 'బాహుబలి'ని ఎంజాయ్ చేశా. మళ్లీ ఇలాంటి సినిమా ఎవరైనా చేద్దామంటే నా వల్ల కాదు. అది లక్ష కోట్ల సినిమా అని చెప్పినా చేయను. నాలుగేళ్ల తర్వాత అలాంటిదేమైనా ఆఫర్ వస్తే చేస్తానేమో అని ప్రభాస్ స్పష్టం చేసారు.
 
ఇకపోతే.. నిర్మాతలు మాపై నమ్మకంతో రూ.కోట్లు ఖర్చు పెట్టారు. సినిమా ఫ్లాప్ అయితే వాళ్ల కోసం నేనో మూడు, రాజమౌళి ఓ మూడు సినిమాలు చేసినా నిర్మాతలు బయట పడలేనంత ఖర్చు పెట్టారు. అందుకే మొదటి భాగం రిలీజ్ సమయంలో భయంకరమైన టెన్షన్ ఉండేది..... తొలి భాగం హిట్టయింది కాబట్టి రెండో భాగం విషయంలో అప్పుడున్నంత టెన్షన్ లేదు. కాన్ఫిడెంటుగా ఉన్నామని ప్రభాస్ తెలిపారు.
 
అలాగే, ఈ చిత్రం కోసం రాజమౌళి ఎంత హార్డ్‌వర్క్ చేశాడు? నేను ఎన్నేళ్లు టైమ్ కేటాయించాను? అనేవి పక్కన పెడితే ... లైప్‌లో మళ్లీ సంపాదించుకోలేని డబ్బులను నిర్మాతలు ఖర్చుపెట్టారు. హిట్టయితే సరిపోదు. హిట్టయినా ప్లాప్ కిందే లెక్క. బ్లాక్ బస్టర్ అవ్వాలి.... వేరే ఛాయిస్ లేదు. అప్పుడు నిర్మాతలు సేఫ్ అవుతారు అని ప్రభాస్ చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments