Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నాళ్లిలా? పెళ్లి చేస్కోండి దిల్ రాజు గారూ... అంటున్న సన్నిహితులు?

Webdunia
మంగళవారం, 11 ఫిబ్రవరి 2020 (11:12 IST)
కడ దాకా జీవన యానం చేయాల్సిన భాగస్వామి మధ్యలోనే చేయి వదిలేసి వెళ్లిపోతే... గడిచే రోజులు చాలా భారంగా వుంటాయి. అదే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలోనూ జరిగింది. ఆయన సతీమణి అనిత 2017లో గుండెపోటుతో హఠన్మరణం చెందారు. దీనితో దిల్ రాజు చాలా రోజులు ఆ వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత సినిమా నిర్మాణంలో ఫుల్ బిజీ అయిపోతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
 
ఇటీవలే ఆయన సమంత ప్రధానపాత్రలో జాను చిత్రాన్ని నిర్మించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇంకా పలు ప్రాజెక్టులు నిర్మాణ దశలో వున్నాయి. చెప్పాలంటే దిల్ రాజు జీవితం పూర్తిగా సినిమా నిర్మాణంలో మునిగిపోయి వుంది. ఏదైనా కాస్త తీరిక దొరికితే తన కుమార్తె ఇంటికి వెళ్లి మనవరాలితో ఆటలాడుతూ వుంటారు. 
 
ఐతే.. కొన్నిసార్లు భార్య లేని లోటు, వంటరి యానం ఇబ్బందికి గురిచేస్తుంది. దిల్ రాజు జీవితంలో అలాంటి స్థితిని చూసిన ఆయన సన్నిహితులు రెండో పెళ్లి చేసుకుంటే జీవితంలో వున్న లోటు కాస్తయినా భర్తీ అవుతుందని సూచనలు చేస్తున్నారట. 49 ఏళ్లు నిండినా యువకుడిలా చలాకీగా వుండే ఆయన్ని చూస్తే చాలు.. సర్ పెళ్లి చేసుకోండి.... అంటూ సలహా ఇస్తున్నారట. దిల్ రాజు కూడా దీనిపై ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ సినీ జనం టాక్. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోసాని వంటి వ్యక్తులకు ఎవరూ మద్దతు ఇవ్వరాదు : సీపీఐ రామకృష్ణ

Do not Disturb, హై బేబీ నువ్వీ లెటర్ చదివేటప్పటికి నేను చనిపోయి వుంటా: భర్త ఆత్మహత్య

యువకుడికి బడితపూజ చేసిన వృద్ధుడు .. ఎందుకో తెలుసా? (Video)

No mangalsutra, bindi? మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం లేదు.. నీపై భర్తకు ఎలా ఇంట్రెస్ట్ వస్తుంది?

స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ మెగా రాకెట్ ప్రయోగం సక్సెస్.. కానీ గాల్లోనే పేలిపోయింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

Hibiscus Flower: మహిళలకు మెరిసే అందం కోసం మందార పువ్వు

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments