Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్ 'కాలా' కొనాలా? వామ్మో అంటున్న తెలుగు సినిమా డిస్ట్రిబ్యూటర్లు???

దక్షణాది సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్ గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమవుతున్నాడు. 8 సంవత్సరాల క్రితం వచ్చిన రోబో సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. పైగా కొత్త రకం ప్రయోగాలత

Webdunia
మంగళవారం, 29 మే 2018 (17:47 IST)
దక్షణాది సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్ గత కొంతకాలంగా హిట్లు లేక సతమతమవుతున్నాడు. 8 సంవత్సరాల క్రితం వచ్చిన రోబో సినిమా తర్వాత ఆ స్థాయి విజయాన్ని నమోదు చేయలేకపోయాడు. పైగా కొత్త రకం ప్రయోగాలతో చేతులు కాల్చుకోవడమే కాకుండా నిర్మాతలకు తీరని నష్టాన్ని మిగిల్చాడు. రోబో తర్వాత వచ్చిన విక్రమసింహ, లింగా, కబాలి సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందులోనూ ఆరోగ్య సమస్యతో కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. 
 
తాజాగా కాలా సినిమాతో మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ అనుకున్న స్థాయిలో జరగకపోయేసరికి, రజనీనే స్వయంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నాడు. ఒకవైపు కుర్ర హీరోల జోరు, మరోవైపు స్టార్ హీరోల వరుస విజయాల నేపథ్యంలో ఈ సినిమా ఎంతవరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి. 
 
మరో ప్రక్క రజనీ హీరోగా రోబో 2.0 అంటూ డైరెక్టర్ శంకర్ చాన్నాళ్లుగా భారీ బడ్జెట్‌తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా బాహుబలి సినిమాను మించేలా ఉంటుందని అందరూ ఎదురుచూస్తున్నారు. రజనీ గత చిత్రాల వసూళ్లను దృష్టిలో ఉంచుకుని కాలా చిత్రాన్ని కొనుగోలు చేయడానికి తెలుగు డిష్ట్రిబ్యూటర్లు సైతం కొంత అనాసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతానికైతే కాలా సినిమాకి సంబంధించిన ప్రమోషన్‌లలో బిజీ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. రజనీ గత చిత్రం కబాలి సినిమా దర్శకుడైన పా.రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు, హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments