Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ 'పుష్ప' మూవీలో కీలక పాత్రలో నారా రోహిత్!

Webdunia
ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (16:06 IST)
స్టైలిష్ స్టార్ అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. కె.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, క‌రోనా మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ అత‌లాకుత‌ల‌మైంది. ఇపుడు సినీప‌రిశ్ర‌మ మెల్ల‌మెల్ల‌గా కోలుకుంటోంది. 
 
త‌మ సినిమాల షూటింగ్స్ షురూ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు హీరోలు, డైరెక్ట‌ర్లు. టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు పుష్ప షూటింగ్ ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. 
 
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆస‌క్తిక‌ర అప్‌డేట్ ఒక‌టి ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. యువ న‌టుడు నారా రోహిత్ ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌నున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. నారా రోహిత్ పేరును అల్లు అర్జున్ సూచించాడ‌ట.
 
'రంగ‌స్థ‌లం'లో ఆదిపినిశెట్టి రోల్‌లాగే నారా రోహిత్ పాత్ర ఉంటుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. హిట్టు, ప్లాఫ్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోయే నారా రోహిత్ ఈ సారి ప్రధాన పాత్రలో ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించేందుకు సిద్ద‌మ‌వుతున్నాడ‌న్న‌మాట‌.
 
మరోవైపు, టాలీవుడ్ యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీపై ఉన్న ప్రేమ‌తో స్పెష‌ల్ గిఫ్ట్ పంపారు. ఆ గిఫ్ట్ ఏంటంటే రౌడీ వేర్ నుండి స్పెష‌ల్‌గా డిజైన్ చేయ‌బ‌డ్డ టీష‌ర్ట్‌, డిజైన్ మాస్క్‌లు, స్పెష‌ల్ ట్రాక్. వీటిని చూసి ఫిదా అయిన అల్లు అర్జున్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు థ్యాంక్స్ చెబుతూ వీటిని త‌న ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశాడు. ఇక వీరిద్ద‌రి సినిమాల విష‌యానికి వ‌స్తే బన్నీ త్వ‌ర‌లో 'పుష్ప' సినిమా చేయ‌నుండ‌గా, విజ‌య్ దేవ‌ర‌కొండ 'ఫైట‌ర్' అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments