Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర ప్రీ రిలీజ్ వేడుకకు మహేష్ బాబు రావాలంటే ఓ షరతు వుంది !

డీవీ
శనివారం, 14 సెప్టెంబరు 2024 (13:11 IST)
Devara new
ఎన్.టి.ఆర్. దేవర సినిమా ప్రమోషన్స్ ముందుగా బాలీవుడ్ నుంచి చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. దక్షిణాదిలో కూడా పూర్తి చేసుకుని పైనల్ గా తెలుగులో ప్రీ రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈనెల  27న దేవర పార్ట్ 1 సినిమా విడుదలకు సిద్ధం చేస్తున్నామని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కొరటాల శివ దర్శకుడు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతలు.
 
కాగా, దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అంతకుముందు ప్రభాస్ కల్కి చేసినట్లుగానే రామోజీ ఫిలింసిటీలో చేయనున్నట్లు సమాచారం. ఇందుకు ఈనెల 22న తేదీ ఫిక్స్ చేశారు. అయితే ఈ వేడుకకు మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ రావాలంటే రాజమౌళి కొత్త సినిమా కోసం బాడీ మేకోవర్ చేస్తున్నాడు కాబట్టి ఆయన పర్మిషన్ కూడా కావాలి. ఇటీవలే ఈ విషయాన్ని సుధీర్ బాబు చెబుతూ, మా నాన్న హీరో సినిమాకు మహేష్ బాబును తీసుకురండని అభిమానులు అడుగగా, అది నా చేతుల్లో లేదు. రాజమౌళి గారు పర్మిషన్ ఇవ్వాలి. ఆయన ఇస్తే తప్పకుండా వస్తారని తెలిపారు. సో.. మరి దేవరకు మహేష్ బాబు రావాలంటే రాజమౌళి పర్మిషన్ ఉండాలి. త్వరలో ప్రకటన కోసం అభిమానులు వెయింటింగ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments