Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒకే ఇంట్లో వందలాది పాములు.. ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన

Advertiesment
Snake

సెల్వి

, శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (20:02 IST)
పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా నెట్టింట చక్కర్లు కొడుతూనే వున్నాయి. ఈ వీడియోలు భయానకంగానూ వుంటాయి. తాజాగా ఓ ఇంట్లో వందల కొద్ది పాములు బైటపడ్డాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఒక్క పాము వుంటేనే జనం ఆమడ దూరం పారిపోతుంటారు. అలాంటిది వందలాది పాములుంటే ఇంకేమైనా వుందా.. అంటూ ఈ వీడియోను చూసినవారంతా షాకవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 
 
తిరువురులోని.. గంపలగూడెంలో ప్రాంతంలో ఒకే ఇంట్లో 100 కొద్ది పాములు బైటపడ్డాయి. ప్రహారికి గోడకు ఒక కన్నం పడింది. దీంతో ఆ కన్నం పూడ్చేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. గోడవద్దకు వెళ్లి.. కన్నంను పరిశీలించింది. ఇంతలో ఆమె నోటమాటరాలేదు. 
 
అక్కడ వందల కొద్ది పాములు బైటపడ్డాయి. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. వాటిని వానపాములుగా గుర్తించారు. వాటిని ఆ ఇంటి యజమానులు, చుట్టుపక్కల స్థానికులు బయటికి తీసిపారేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేణు స్వామికి కోర్టులో గట్టి ఎదురుదెబ్బ.. కేసు నమోదు చేయండి..