Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌కు అందానికి పడిపోయిన సారా.. కలిసి తీరాల్సిందే.. ఆలుమా డోలుమా అంటూ చిందులు

కోలీవుడ్ స్టార్ అజిత్ అంటేనే అందం అభినయానికి పెట్టింది పేరు. తమిళనాడులోని ప్రతి యువతి ఇష్టపడే హీరో. అందుకే ఈ నటుడికి ఎనలేని మహిళాదరణ లభించింది. ఇక టాప్ హీరోయిన్ల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (15:32 IST)
కోలీవుడ్ స్టార్ అజిత్ అంటేనే అందం అభినయానికి పెట్టింది పేరు. తమిళనాడులోని ప్రతి యువతి ఇష్టపడే హీరో. అందుకే ఈ నటుడికి ఎనలేని మహిళాదరణ లభించింది. ఇక టాప్ హీరోయిన్ల నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోయిన్ల వరకూ ఆయనతో నటించడానికి మొగ్గు చూపుతుంటారు. 
 
తాజాగా ఈ కోవలో బ్రూనై దేశ యువరాణి సారాని కూడా చేరిపోయింది. అజిత్ అందానికి బానిసై పోయింది. ఆయన్ని తను కలిసే తీరాలి అని తన అనుచరులను హుకం జారీ చేసిందట. అసలేం జరిగిందంటే ప్రపంచంలోని అతి సంపన్న దేశాల్లో బ్రూనై దేశం ఒక్కటి. పసిడితో అలంకరించబడిన అద్భుత ప్రాంగణం కలిగిన దేశం బ్రూనై. అక్కడి రాజులు, రాణులు అత్యంత ఆడంబర జీవితాన్ని అనుభవిస్తుంటారు. 
 
గత వారం బ్రూనై దేశం ప్రపంచ దేశాల్లోని అత్యధిక వజ్రవైఢూర్య సంపన్నులకు బ్రహ్మాండమైన విందును ఏర్పాటు చేశారు. ఆ విందు ఆటాపాటా అంటూ యమ మజాగా సాగింది. అందులో ప్రపంచ దేశాలకు చెందిన హుషారైన సంగీతంతో కూడిన పాటలను ప్రదర్శించారు. ఆ వేడుకలో అందరూ పాల్గొని ఆడిపాడారు. విశేషం ఏమిటంటే అలాంటి పాటల్లో అజిత్ నటించిన 'వేదాళం' చిత్రంలోని ఆలుమా డోలుమా అనే పాట చోటు చేసుకుంది. 
 
ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆ వేడుకలో ఆలుమా డోలమా పాటలోని అజిత్ ఆ దేశ యువరాణి సారాకి పిచ్చపిచ్చగా నచ్చేశారట. ఆహా ఏమా అందం, ఏమా గంభీరం అంటూ అతడిపై పొగడ్తల వర్షాన్ని కురిపించింది. అతడి అందానికి దాసోహమైన ఆ యువరాణి అజిత్‌ను వెంటనే విందుకు ఆహ్వానించండి... ప్రపంచ దేశాలు అబ్బురపడేలా విందును ఏర్పాటు చేస్తాను అని తన అనుంగులకు ఆదేశాలు జారీ చేశారట. వారిప్పుడు అజిత్‌ను తమ దేశ ఆతిథ్యానికి ఆహ్వానించే పనిలో పడ్డారని వార్తలు వెలువడుతున్నాయి. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments