Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ తరుణ్‌ భాస్కర్‌కు ఏమైంది? హీరోగా చేస్తున్నాడట... దర్శకుడెవరంటే?

Webdunia
సోమవారం, 8 అక్టోబరు 2018 (19:47 IST)
పెళ్లి చూపులు సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై.. తొలి ప్ర‌య‌త్నంలోనే సెన్సేష‌న్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. ఆ త‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది అనే సినిమాని తెరకెక్కించినా.. ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేక‌పోయాడు. త‌ర్వాత సినిమాని కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లోనే చేయ‌నున్నాడు. రానాతో ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది కానీ... ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి స‌మాచారం లేదు. అయితే... త‌రుణ్ భాస్క‌ర్ ఇప్పుడు న‌టుడుగా మారి ఓ సినిమా చేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
 
ఈ మూవీ బ్యాక్‌డ్రాప్ ఏంటంటే... తీవ్రవాద నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంద‌ట‌. ఇందులో తరుణ్‌ భాస్కర్‌ హైదరాబాద్‌ పాతబస్తీ యువకుడిగా కనిస్తారని టాక్‌. తమిళ యువకుడు దర్శకత్వం వహించే ఈ చిత్రం త్వరలో సెట్స్‌ మీదకు వెళ్తుందని తెలిసింది. 
 
చిత్ర పరిశ్రమకు తరుణ్‌ భాస్కర్‌ దర్శకుడిగా పరిచయమైనా… నటుడిగా కెరీర్ స్టార్ట్ చేస్తుండ‌టం విశేషం. మ‌రి.. దర్శకుడిగా పేరు తెచ్చుకున్న త‌రుణ్ భాస్క‌ర్ నటుడిగా ఎంతవ‌ర‌కు రాణిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments