Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్ మూవీలో ఆ హీరోయిన్‌కి ఛాన్స్ ఇచ్చారా..?

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (19:31 IST)
యాక్ష‌న్ హీరో గోపీచంద్‌తో తమిళ దర్శకుడు తిరు ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఇటీవ‌ల‌ ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్‌లో ప్రారంభమయ్యింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ భారీ ఫైట్ సీక్వెన్స్‌తో మొదలవగా, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ని చిత్రీకరిస్తున్నారు. యాభై రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్‌లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు.
 
ఈ చిత్రంలో న‌టించే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఎనౌన్స్ చేయ‌లేదు. అయితే.. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాలో గోపీచంద్ స‌ర‌స‌న కథానాయికగా ఎవ‌రైతే బాగుంటారా అని కొంతమంది పేర్లను పరిశీలించారట‌. తమన్నా అయితే  బాగుంటుంద‌ని టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ చెప్ప‌డంతో.. ఆమెను సంప్ర‌దించ‌డం జ‌రిగింద‌ట‌. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఎక్కువని చెబుతున్నారు. తమన్నా ఓకే అంటే గోపీచంద్‌తో ఆమెకి ఇది తొలి సినిమా అవుతుంది. 
 
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా, వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై ప్రొడక్షన్ నెంబర్ 18గా అనిల్ సుంకర ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా మే నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments