Webdunia - Bharat's app for daily news and videos

Install App

'దర్బార్' దుమారం : డబ్బులుంటే ఖైదీలు కూడా షాపింగ్‌కు వెళ్లొచ్చు... ఆమెను ఉద్దేశించేనా?

Webdunia
శుక్రవారం, 10 జనవరి 2020 (14:18 IST)
సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం దర్బార్. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయనతార, నివేదా థామస్‌లు నటించారు. ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా కలెక్షన్ల పరంగా కుమ్మేస్తోంది. అయితే, ఈ చిత్రంలోని ఓ డైలాగ్ ఇపుడు తమిళనాట పెను దుమారాన్ని రేపింది. ఆ డైలాగ్ కూడా జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న శశికళను ఉద్దేశించినదిగా ఉందంటూ పలువురు ఆమె అనుచరులు రచ్చ చేస్తున్నారు. పైగా, ఈ డైలాగ్‌ను తొలగించాలంటూ వారు ఆందోళనకు దిగారు. దీంతో దర్బార్ చిత్రంలోని ఈ డైలాగ్ ఇపుడు పెద్ద దుమారాన్నే రేపుతోంది.  
 
గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఒక సన్నివేశంలో జైలులో ఖైదీ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుంటాడు. అప్పుడు డబ్బులుంటే ఖైదీలు షాపింగ్‌ కూడా వెళ్లొచ్చన్న డైలాగ్‌ ఉంది. ఆ సన్నివేశంలో ఎక్కడా శశికళ పేరు లేకపోయినా.. అది శశికళను ఉద్దేశించే పెట్టారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
మరోవైపు, ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్మురేపుతోంది. ముఖ్యంగా తమిళనాట కనకవర్షం కురిపిస్తోంది. ఫలితంగా సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. అలాగే, తెలుగులో కూడా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. ఫలితంగా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.7.5 కోట్ల గ్రాస్‌ను .. రూ.4.5 కోట్ల షేర్‌ను సాధించింది. ఇవి చెప్పుకోదగిన వసూళ్లేనని అంటున్నారు. ఓవర్సీస్‌లోను ఈ సినిమా భారీ వసూళ్లనే రాబడుతోంది. తెలుగు వెర్షన్ సంగతి అటుంచితే, తమిళనాట మాత్రం అందరి అంచనాలకు మించి వసూళ్లు రాబడుతోంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments