Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ - జాకీచాన్ - సోనమ్ కపూర్ కాంబోలో ఫాంటసీ మూవీగా ''చినీ సగ''..!

ర‌జినీకాంత్ అంటే స్టైల్... జాకీచాన్ అంటే యాక్ష‌న్... స్టైల్ యాక్షన్ రెండూ ఒక చోట చేరితే... ప్రేక్షకులకు పండగే పండగ... ఈ కింగ్స్ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే... సంచ‌ల‌న‌మే... రికార్డు బద్దలు కొట్టడం ఖా

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (13:15 IST)
ర‌జినీకాంత్ అంటే స్టైల్... జాకీచాన్ అంటే యాక్ష‌న్... స్టైల్ యాక్షన్ రెండూ ఒక చోట చేరితే... ప్రేక్షకులకు పండగే పండగ... ఈ కింగ్స్ ఇద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తే... సంచ‌ల‌న‌మే... రికార్డు బద్దలు కొట్టడం ఖాయం. ర‌జినీకాంత్ - జాకీచాన్ కాంబినేష‌న్లో సినిమాను తెరకెక్కించేందుకు క‌బాలి మ‌లేషియ‌న్ ప్రొడ్యూస‌ర్ మొహ‌ద్ ర‌ఫీజీ మొహ‌ద్ జిన్ సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ విష‌యాన్ని నిర్మాత మొహ‌ద్ ర‌ఫీజీ మొహ‌ద్ జిన్ మ‌లేషియ‌న్ మీడియాకి కూడా తెలియ‌చేసార‌ట‌. ర‌జినీకాంత్, జాకీచాన్, కాంబినేష‌న్‌లో ఓ ఫాంట‌సీ మూవీ రూపొందించ‌డానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటికే ఆ నిర్మాత రజినీకాంత్, జాకీచాన్‌లను కూడా సంప్రదించాడట. అంతేకాకుండా ఈ చిత్రానికి ''చినీ సగ'' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట. ఇద్దరు మూవీ లెజెండ్స్ నటించే ఈ మూవీలో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.
 
అంతేకాకుండా ఈ సినిమాలో మలేషియా నటీనటులు కొందరు కీలక పాత్రల్లో నటిస్తారట. మలేషియాలోని చిని అనే సరస్సులో ఉండే డ్రాగన్ పైనే ఈ సినిమా స్టోరీ నడుస్తుందని నిర్మాత తెలిపారు. భారత్, నార్వే, ఇండోనేషియా, చైనాల్లో ఈ సినిమా షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నారట. నాలుగేళ్ల కిందటే ఈ సినిమా చేయాలనుకున్నానని అప్పట్లో కుదరలేదని మహమూద్ జిన్ చెప్పాడు. ఈ మూవీ చాలా వరకు గ్రాఫిక్స్‌తోనే ఉంటుందట. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే... ఈ ప్రాజెక్ట్ ఇండియ‌న్ స్క్రీన్ పైనేకాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయం. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments