Webdunia - Bharat's app for daily news and videos

Install App

యానిమల్-2లో రష్మికకు నో ఛాన్స్: మాళవిక మోహనన్‌కే ఛాన్స్?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (15:07 IST)
టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన వయాలెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. 
 
ఎమోషనల్, వయలెంట్ కంటెంట్‌‍తో వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా నెక్ట్స్ లెవల్ కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.260 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే రూ.700 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది.
 
సినిమా చివర్లో సందీప్ రెడ్డి వంగా యానిమల్ పార్క్ అనే సీక్వెల్ వస్తుందని చెప్పి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాడు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమా గురించి వినిపించే చిన్న వార్త కూడా క్షణాల్లో వైరల్ అవుతుంది.
 
ఇక తాజాగా యానిమల్ సీక్వెల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అదేంటంటే.. యానిమల్ సినిమా సీక్వెల్ కోసం సందీప్ హీరోయిన్‌ని మార్చబోతున్నాడట. 
 
యానిమల్ సినిమాలో తన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచిన రష్మిక మందన్న.. అయితే ఆమె స్థానంలో మలయాళ భామ మాళవిక మోహనన్ సెకండ్ పార్టీలో నటిస్తుందనే వార్త వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments