Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య సినిమాకు నో చెప్పిన సునీల్... పవన్ కళ్యాణ్ సినిమాకు ఓకే అన్నాడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ''కాటమరాయుడు''. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (15:50 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ''కాటమరాయుడు''. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ ఫ్యాక్షనిస్టు లీడర్‌గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రం అనంతరం పవన్ - త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులని పూర్తి చేసిన త్రివిక్రమ్.. ప్రస్తుతం నటీనటులను వెతికే పనిలో బిజీ బిజీగా ఉన్నాడు.
 
ఇందులో భాగంగా పవన్‌కి స్నేహితుడిగా ఉండే ఒక పాత్ర కోసం సునీల్ తీసుకొన్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మాటల మాంత్రికుడు.. సునీల్ కోసం ఓ సూపర్బ్ రోల్‌ని సినిమాలో పెడుతున్నాడట. కేమియో రోల్ అయినా.. సునీల్ స్క్రీన్ పై ఉన్నంత సేపు కడుపుబ్బ నవ్వించేలా సీన్స్ ఉంటాయని దర్శకుడు అంటున్నాడు. గతంలో సునీల్ కోసం త్రివిక్రమ్ రాసిన ప్రతీ పంచ్ పేలింది. ఇప్పుడు పవన్ సినిమాలో సునీల్‌కి రోల్ ఆఫర్ చేయడం.. దానికి త్రివిక్రమ్ రైటర్ కం డైరెక్టర్ కావడంతో.. ఈ కాంబినేషన్ భలే క్రేజీగా మారిపోయింది.
 
ఈ సినిమాకి సునీల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ హీరో మీద కొన్ని రూమ‌ర్స్ కూడా వ‌చ్చాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేయ‌డం కుద‌ర‌లేదు కానీ.. పవన్ కళ్యాణ్ సినిమా అంటే వెంటనే డేట్లు ఇచ్చేశాడు అంటూ టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపించాయి. అసలు అన్నయ్య సినిమాను ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చిందో సునీల్ వివరంగా చెప్పాడు.

''ఈడు గోల్డ్ ఏహా సినిమా క్లైమాక్స్‌ షూట్ ప్లాన్ చేసిన డేట్స్ అప్పుడే 150వ సినిమా డేట్స్ అడిగారు. ఒక‌వేళ క్లైమాక్స్ పోస్ట్ పోన్ చేసి ఉంటే దాదాపు 30 మంది కీల‌క‌మైన ఆర్టిస్టుల డేట్ల‌న్నీ పోతాయి. నిర్మాత‌ల‌కు కోట్ల‌లో న‌ష్టం వ‌స్తుంది. అందుకే 150వ సినిమాలో చేయ‌లేక‌పోయానని'' చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు పవన్ సినిమాలో ఆయన స్నేహితుడిగా అలీ ఉండేవాడు. ఇప్పుడా అవకాశం సునీల్‌కి దక్కడంతో ఎగిరిగంతేస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

School van: కడలూరులో ఘోరం- స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు మృతి (video)

ఏపీలో రెచ్చిపోయిన కామాంధులు.. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. వద్దని వేడుకున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments