Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైట‌ర్ ట‌ర్న్‌డ్ డైరెక్ట‌ర్‌తో సుధీర్ బాబు సినిమా

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (11:10 IST)
సమ్మోహనం, నన్ను దోచుకుందువటే.. చిత్రాల‌తో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్న యువ హీరో సుధీర్ బాబు మరో క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈసారి రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇంత‌కీ ఆ రైట‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నుకుంటున్నారా..? అమృతం సీరియల్ ద్వారా నటుడిగా సుపరిచితుడైన హర్షవర్ధన్ ఆ త‌ర్వాత రైట‌ర్‌గా మారి స‌క్స‌ెస్ సాధించాడు. ఇష్క్, మ‌నం చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా వ‌ర్క్ చేసాడు.
 
ఆ మధ్య గుడ్, బ్యాడ్, అగ్లీ అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించాడు. అంతేకాకుండా ఆ సినిమాకు సంగీతం కూడా ఆయనే సమకూర్చారు. ఆ సినిమాకు సంబంధించిన ట్రైలర్, రెండు పాటలు విడుద‌లై అందరిని ఆకట్టుకున్నాయి, సంగీతం ఇళయరాజాను తలపిస్తుండగా, ఫస్ట్ అటెంప్ట్‌లోనే అనుభవం ఉన్న డైరెక్టర్‌గా సినిమాను తీసాడని ట్రైలర్ చూసినవారు అన్నారు. 
 
కానీ, ఎందుకో ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... రీసెంట్‌గా హర్షవర్ధన్ సుధీర్ బాబుకు ఓ క‌థ చెప్పాడ‌ట‌. ఆ క‌థ నచ్చడంతో ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

Amaravati: అమరావతిలో 74 ప్రాజెక్టులు- సీఆర్డీఏ భవనం ఆగస్టు 15న ప్రారంభం

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments