Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ గురించి నాగ‌బాబు షాకింగ్ కామెంట్స్..!

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2018 (10:21 IST)
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు నాగబాబు ఓ యూ ట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో నంద‌మూరి బాల‌కృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేయ‌డం అటు అభిమానుల్లోను, ఇటు ఇండ‌స్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే... సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు నాగ‌బాబుని ఇంట‌ర్వ్యూ చేస్తూ... బాల‌కృష్ణ గురించి చెప్ప‌మ‌ని అడిగితే.. ఐయామ్ సారీ, నేను త‌న గురించి మాట్లాడ‌ను! అంటూ ఝ‌ల‌కిచ్చారు. ఈ మాట అన్న త‌రువాత వెంట‌నే మ‌ళ్లీ త‌న మాట స‌వ‌రించుకుంటూ బాల‌య్య ఎందుకు తెలియ‌దు.. ఆయ‌నో సీనియ‌ర్ మోస్ట్ ఆర్టిస్ట్.. అప్ప‌ట్లో నేర‌ము-శిక్ష‌ వంటి చిత్రాల్లో కృష్ణ‌తో క‌లిసి న‌టించారు అని త‌న‌దైన శైలిలో బాల‌య్య‌కు కౌంట‌రిచ్చాడు. 
 
గ‌త కొంతకాలంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ పైన బాల‌కృష్ణ వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్న విష‌యం తెలిసిందే. దాన్ని దృష్టిలో పెట్టుకున్న నాగ‌బాబు వ్యంగ్యంగా కౌంట‌ర్‌లు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు బాల‌య్య గురించి మ‌ళ్లీ చెప్పే ప్ర‌య‌త్నం చేసినా త‌నంటే ఎవ‌రో నాకు తెలియ‌ద‌ని నాగ‌బాబు లైట్ తీసుకోవ‌డంతో కావాల‌నే ఆయ‌న ఇలా మాట్లాడుతున్నాడ‌ని తెలిసింది. నాగ‌బాబు వ్యాఖ్య‌ల గురించి బాల‌కృష్ణ కానీ.. నంద‌మూరి అభిమానులు కానీ రియాక్ట్ అవుతారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments