Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు ఇతనే (video)

Webdunia
సోమవారం, 8 జూన్ 2020 (15:27 IST)
చిరంజీవి వారసుడు రామ్ చరణ్‌, నాగార్జున వారసులు నాగచైతన్య, అఖిల్ ఎంట్రీ ఇచ్చారు కానీ.. నందమూరి నట సింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ మాత్రం ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అభిమానులు బాలయ్య వారసుడు ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కానీ.. ఇప్పటివరకు క్లారిటీ లేదు. గతంలో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలయ్యను అడిగితే... నటనలో శిక్షణ తీసుకుంటున్నాడు. సమయం వచ్చినప్పుడు పూర్తి వివరాలతో ఎనౌన్స్ చేస్తానన్నారు.
 
ఇలా చెప్పి చాలా రోజులు అయ్యింది కానీ.. అఫిషియల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాకపోవడంతో.... అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా..? ఉండదా..? అనే అనుమానాలు మొదలయ్యాయి.
 
 అయితే.. మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటే ఎవరి డైరెక్షన్లో ఉంటుంది.. అనేది ఆసక్తిగా మారింది. పూరి జగన్నాథ్, క్రిష్‌ పేర్లు ప్రముఖంగా తెర పైకి వచ్చాయి. ఆ తర్వాత మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలయ్య ఏమీ చెప్పకపోవడంతో ఇప్పట్లో ఉండకపోవచ్చు అంటూ వార్తలు వచ్చాయి.
 
అయితే... మళ్లీ మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు రావడం ప్రారంభం అయ్యాయి. స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ దర్శకత్వంలో బాలయ్య వారసుడు ఎంట్రీ ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ వార్తల్లో వాస్తవం లేదని తెలిసింది. 
 
తాజా వార్త ఏంటంటే... సక్సస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని మోక్షజ్ఞ కోసం స్టోరీ రెడీ చేయమని బాలయ్య చెప్పారని తెలిసింది.
 
 ప్రస్తుతం అనిల్ రావిపూడి మోక్షజ్ఞ కోసం కథ రెడీ చేస్తున్నాడని... స్టోరీ ఫైనల్ అయితే అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే... బాలయ్య అభిమానులకు పండగే..!

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments