'సర్కార్ వారి పాట' సినిమా స్టోరీ లైన్ ఇదేనా..?

మంగళవారం, 2 జూన్ 2020 (20:18 IST)
సూపర్‌స్టార్ మహేష్‌బాబు-గీత గోవిందం ఫేమ్ పరశురామ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మే 31న సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా సర్కారు వారి పాట చిత్రం నుంచి విడుదలైన మహేష్ ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వస్తోంది.

ఈ చిత్రం లాక్‌డౌన్ పూర్తయిన తర్వాత పట్టాలెక్కనుంది. బ్యాంకింగ్ సెక్టార్‌లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని ఇప్పటికే ఫిల్మ్‌నగర్‌లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ చిత్రంపై మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
'సర్కార్ వారి పాట' చిత్రంలో మహేష్ బాబు బ్యాంక్ ఉద్యోగి కొడుకుగా కనిపించనున్నాడని, ఆర్థిక సమస్యల వల్ల తన కుటుంబం ఎదుర్కొన్న ఇబ్బందులను ఎలా ఎదుర్కొన్నాడనే నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కెక్కబోతోందనే వార్త తాజాగా వినిపిస్తోంది. ఇప్పటికే వరుస హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న మహేష్, ఈ చిత్రంతో మరోసారి మాయచేస్తాడేమే చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 'ఆర్ఆర్ఆర్' నిర్మాత దానయ్యకు హార్ట్ అటాక్!!?