Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'సర్కారు వారి పాట'!

Advertiesment
సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న 'సర్కారు వారి పాట'!
, ఆదివారం, 31 మే 2020 (22:34 IST)
ప్రతి యేడాది సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన సూపర్ స్టార్ మహేష్ తన కొత్త సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ విడుదల చేస్తారు. ఈసారి తన కొత్త సినిమా 'సర్కారు వారి పాట'ను అనౌన్స్ చేశారు. మహేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్‌తో స్టైలిష్‌గా మెడ మీద వన్ రూపీ కాయిన్ టాటూతో ఇయర్ రింగ్ పెట్టుకుని ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నారు. 
 
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి. 'సర్కారు వారి పాట'ను అనౌన్స్ చేస్తూ సూపర్ స్టార్ మహేష్, "మరో హ్యాట్రిక్‌కు ఇది బ్లాక్ బస్టర్ స్టార్ట్" అన్నారు. 
 
దీనిపై దర్శకుడు పరశురామ్ స్పందిస్తూ, "సూపర్ స్టార్ మహేష్‌ని డైరెక్ట్ చేయాలనే నా కల నెరవేరింది. దీని కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకి వెళదామా అని ఉంది" అన్నారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందిస్తూ, "సూపర్ స్టార్ మహేష్ గారంటే నాకెంతో ఇష్టం. ఆయనతో 7 సంవత్సరాల తర్వాత కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా మ్యూజికల్‌గా సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది" అని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, "సూపర్ స్టార్ కృష్ణ ఆశీస్సులతో సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' అనౌన్స్ చేయడం చాలా ఆనందంగా ఉంది" అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొండలను సైతం ఢీకొట్టిన ఘనుడు - కృష్ణ జీవితంలో మధుర ఘట్టాలు..