Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్న రాజమౌళి... ఏప్రిల్‌లో 'ఆర్ఆర్ఆర్'

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2020 (16:31 IST)
వచ్చే యేడాది సంక్రాంతి రేస్ నుంచి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తప్పుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న "ఆర్ఆర్ఆర్" (రౌద్రం - రణం - రుధిరం) చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
నిజానికి ఈ చిత్రాన్ని వచ్చే జూలై 30వ తేదీన విడుదల చేయాలని తొలుత ప్రకటించారు. అయితే, హీరోయిన్ల ఎంపికతో పాటు.. గ్రాఫిక్స్ వర్క్స్, చిత్రం షూటింగ్ ప్రారంభమైన తర్వాత హీరోలు షూటింగ్‌లో గాయపడటం వంటి కారణాల రీత్యా వచ్చే యేడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్ణయించారు. 
 
అయితే, ఇపుడు కరోనా వైరస్ కారణంగా చిత్ర షూటింగా ఆగిపోయింది. ప్రస్తుతం 75 శాతం షూటింగ్ పూర్తయినప్పటికీ.. మిగిలిన షూటింగ్‌తో పాటు గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి చేయాల్సివుంది. ఇక్కడే జాప్యమయ్యేలా కనిపిస్తోంది. ఎందుకంటే గ్రాఫిక్స్ పనులన్నీ విదేశీ కంపెనీలే చేయాల్సివుంది. కానీ, కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో సాధారణ పరిస్థితులు ఇప్పట్లో నెలకొనేలా కనిపించడం లేదు. 
 
ఫలితంగా సంక్రాంతి రేస్ నుంచి తప్పకున్న వేసవి సెలవులను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అందులోభాగంగానే వచ్చే యేడాది ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేసేలా దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటిస్తుండగా ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments