#RRR విడుదల అప్పుడే.. అలియా భట్ రోజుకు ఎంత ఛార్జ్ చేస్తుందో తెలుసా?

శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (13:04 IST)
బాహుబలి సినిమాకు తర్వాత ఆ సినిమా దర్శకుడు జక్కన్న ట్రిపుల్ ఆర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ అలియా, అజయ్ దేవగన్‌తో పాటు హాలీవుడ్ ప్రముఖలు కూడా నటిస్తున్నారు. 
 
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొని వుంది. ఈ నేపథ్యంలో చెర్రీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ వీడియో విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచారు. కానీ లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. 
 
దీంతో రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం వుందని అందరూ అనుకున్నారు. అయితే సినీ యూనిట్ మాత్రం అలాంటి భయం అవసరం లేదని.. సినిమా జనవరి ఎనిమిదో తేదీన రావడం పక్కా అంటున్నారు.. ఆ సినీ యూనిట్ ప్రముఖులు. 
 
ఇకపోతే.. ఈ చిత్రంలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ చిత్రానికి గాను భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్‌ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేసిందని టాక్ వస్తోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం రవితో రెస్టారెంట్‌కి వెళ్తే తప్పుగా అనుకునేవారు.. లిప్ లాక్ అంటే..?శ్రీముఖి