Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"రౌద్రం - రణం - రుధిరం"లో మరో సూపర్ స్టార్?

Advertiesment
, శుక్రవారం, 27 మార్చి 2020 (13:50 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం "రౌద్రం-రణం-రుధిరం" (ఆర్ఆర్ఆర్). జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేయగా అది సోషల్ మీడియాను షేక్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది. 
 
ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ఇప్పటికే ఇద్దరు టాలీవుడ్ అగ్రహీరోలు నటిస్తున్నారు. ఇపుడు మరో సూపర్ స్టార్ నటించనున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన సూపర్ స్టార్ ఎవరో కాదు.. మోహన్ లాల్. మలయాళ సూపర్ స్టార్. 
 
ఈ మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్‌ను ఈ భారీ చిత్రంలో న‌టింప చేయాల‌నుకుని రాజమౌళికి ఆయ‌న‌కు పాత్ర గురించి చెప్పాడ‌ట‌. ఆయ‌న కూడా న‌టించ‌డానికి ఆస‌క్తిని చూపుతున్నాడంటూ వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే, ఈ వార్తలపై రాజమౌళి క్లారిటీ ఇవ్వాల్సివుంది.
 
మరోవైపు, ఈ చిత్రంలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్‌ల‌తో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, ఒలివియా మోరిస్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్, స‌ముద్ర ఖ‌ని ఇలా భారీ తారాగ‌ణం న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా మోష‌న్ పోస్ట‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అల్లు అర్జున్ విరాళం.. మొత్తం రూ.1.25 కోట్లు