Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి తదుపరి ప్రాజెక్టు ఖరారు?.. హీరోగా జూ.ఎన్టీఆర్?

'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (13:14 IST)
'బాహుబలి' చిత్ర దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళి తన తదుపరి ప్రాజెక్టుపై ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించే అవకాశాలు ఉన్నట్టు ఫిల్మ్ నగర్ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ వార్తలే నిజమైతే తొమ్మిదేళ్ళ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో నాలుగో చిత్రం ప్రేక్షకుల మందుకు వస్తుంది. 
 
నిజానికి గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో 'స్టూడెంట్ నంబర్ 1', 'సింహాద్రి', 'యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇపుడు 'బాహుబలి' తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడన్న ప్రచారం టాలీవుడ్ సినీ వర్గాల్లో ప్రచారమవుతోంది. 
 
బాహుబలితో వచ్చిన క్రేజ్‌తో జక్కన్నతో సినిమా చేసేందుకు ఎందరో హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. కానీ, దర్శకధీరుడు మాత్రం మరోసారి ఎన్టీఆర్‌తో సినిమా తీసేందుకు నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే, ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. 
 
మరోవైపు.. రాజమౌళి ఓ హిందీ చిత్రం చేస్తారని, నానీతో ఈగ-2 చేయవచ్చని, అల్లు అర్జున్‌తోనూ చర్చిస్తున్నారని పలు రకాల కథనాలు కూడా వస్తున్నాయి. ఈ వార్తలన్నింటిపై ఓ క్లారిటీ రావాలంటే దర్శకధీరుడే స్వయంగా స్పందించాల్సి ఉంటుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments