Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకేంద్రుడిపై నటి విపరీత వ్యాఖ్యలు.. వెకిలి నవ్వులు... ఎవరా హీరోయిన్? (Video)

తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనసొంతం. అనేక మంది హీరోలు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చ

Webdunia
ఆదివారం, 9 జులై 2017 (12:54 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్ప దర్శకుల్లో ఒకరు కె. రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడిగా గుర్తింపు పొందారు. ఎంతో మంది హీరోయిన్లను టాలీవుడ్‌కు పరిచయం చేసిన ఘనత ఆయనసొంతం. అనేక మంది హీరోలు, హీరోయిన్లకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్. అలాంటి వ్యక్తిపై హీరోయిన్ తాప్సీ విపరీత వ్యాఖ్యలు చేశారు. వెకిలి న‌వ్వులు న‌వ్వింది. స‌మాజాన్ని ప‌ట్టిపీడిస్తోన్న ఏదో సామాజిక రుగ్మ‌త మీద మాట్లాడుతున్న‌ట్లు మాట్లాడి టాలీవుడ్ సినీ ప్ర‌ముఖుల‌కు, అభిమానుల‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
 
ఓ షోలో పాల్గొన్న ఆమె... రాఘ‌వేంద్ర రావువంటి గొప్ప ద‌ర్శ‌కుడిపై వ్యాఖ్య‌లు చేస్తంటే ఆమె ప‌క్కన ఉన్న ఇత‌ర బాలీవుడ్ న‌టులు వెక్కిరింపుల ధోర‌ణితో న‌వ్వారు. ఏదో ఓ కామెడీ క‌థ చెబుతున్న‌ట్లు తాప్సీ టాలీవుడ్‌పై, ద‌ర్శ‌కేంద్రుడిపై త‌న స్థాయి మ‌ర‌చి మ‌రీ సెటైర్లు వేసింది.
 
కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన 'ఝమ్మంది నాదం' చిత్రం ద్వారా వెండితెరకు తాప్సీ పరిచయమైంది. ఆ స‌మ‌యంలో త‌న బొడ్డుపై పూలు, పండ్లు, కొబ్బ‌రికాయ‌లు విసిరారంటూ తాప్సీ హేళ‌న‌గా మాట్లాడింది. తన మొదటి సినిమా డైరెక్టర్‌ తీరుతో త‌న‌కు భయమేసిందని వ్యాఖ్యానించింది. హీరోయిన్ల బొడ్డుపై పూలు, పండ్లు విసిరే రాఘ‌వేంద్ర‌రావు వంటి దర్శకత్వంలోనే శ్రీదేవి, జయప్రద, జయసుధ వంటి అగ్రహీరోయిన్లు కూడా నటించారని తెలిపింది. 
 
కానీ, తన‌పై మాత్రం తొలిరోజే టెంకాయ‌ విసిరారని గ‌ట్టిగా న‌వ్వింది. స్క్రీన్‌పై ఆ సినిమాలోని ఓ పాట‌ను చూపిస్తూ హేళ‌న చేసింది. అస‌లు ద‌క్షిణాది సినిమాల్లో హీరోయిన్స్‌ను కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం చేస్తారని ఆమె తీవ్ర ఆరోపణ చేసింది. ఈ షోకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్‌గా మారుతోంది. దర్శకేంద్రుడిపై తాప్సీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడుతున్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పిఠాపురానికి పవన్ కళ్యాణ్ చేసిన పనులేంటి?

రేషన్ బియ్యం మాయం కేసు : విచారణకు హాజరైన పేర్ని నాని భార్య!

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments