Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబు- మురుగదాస్ సినిమాకు శ్రీదేవి కూతురు జాహ్నవి నో చెప్పిందట... నిజమా..?

అభిమానుల ఆరాధ్య హీరో మహేష్‌తో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది చెప్పండి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ మహేశ్ బాబుతో సినిమాలో నటించడాన

Webdunia
శనివారం, 30 జులై 2016 (16:00 IST)
అభిమానుల ఆరాధ్య హీరో మహేష్‌తో నటించే అవకాశం వస్తే ఏ హీరోయిన్ మాత్రం వదులుకుంటుంది చెప్పండి. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా అంటే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేస్తుంది. కానీ మహేశ్ బాబుతో సినిమాలో నటించడానికి ఒక హీరోయిన్ తిరస్కరించిందట. ఆమె ఎవరో కాదు అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి. అసలు విషయం ఏంటంటే మహేశ్‌ బాబు, తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబోలో ఒక చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. 
 
రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో జాహ్నవి నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించారట. ఇందుకోసం దర్శకుడు మురుగదాస్ జాహ్నవిని సంప్రదించాడట. అయితే ఈ ముద్దుగుమ్మ ఈ అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించిందట. బాలీవుడ్‌లో గజినీ చిత్రం సూపర్ హిట్ సాధించడంతో మురుగదాస్‌కు అక్కడ కూడా విపరీతంగా క్రేజ్ పెరిగిపోయింది. 
 
బాలీవుడ్‌లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న మురుగదాస్ దర్శకత్వంలో సినిమాను జాహ్నవికి కాదనుకోవడానికి కారణం కూడా లేకపోలేదండోయ్. ఎందుకంటే నటనలో శిక్షణ కోసం ఆమె లాస్ ఏంజిల్స్‌లోని యూఎస్సీ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్‌లో చేరనుందట. ఈ కారణంగానే మహేశ్‌తో సినిమా చేసేందుకు జాహ్నవి వదులుకుంది. ఏదేమైనా ప్రిన్స్‌తో నటించే అవకాశాన్ని జాహ్నవి మిస్సయింది సుమా!
అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi వల్లభనేని వంశీ ఇలా జావగారిపోయారేంటి? ఏమైంది? (video)

రూ.6 కోట్ల మోసం కేసులో శ్రవణ్ రావు అరెస్టు!!

పాక్ ఉద్యోగికి భారత్ డెడ్‌లైన్ - 24 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాలంటూ హుకుం..

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

అమ్మాయిలపై అత్యాచారం, బ్లాక్ మెయిల్: ఆ 9 మంది బ్రతికున్నంతవరకూ జైలు శిక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments