Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ సరసన మిత్రవింద: చిరంజీవితో కాజల్ అగర్వాల్ రొమాన్స్.. అదే నిజమైతే శ్రీదేవికి తర్వాత..?!

మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. ఇదేంటి.. మగధీరతో నటించిన ఈ చందమామ మెగాస్టార్‌తో నటించనుందా? చెర్రీతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్‌ సరసన నటించనుందా? అని అనుకుంటున్నారు కద

Webdunia
శనివారం, 30 జులై 2016 (15:27 IST)
మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. ఇదేంటి.. మగధీరతో నటించిన ఈ చందమామ మెగాస్టార్‌తో నటించనుందా? చెర్రీతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్‌ సరసన నటించనుందా? అని అనుకుంటున్నారు కదూ.. అవునండి నిజమే. చిరంజీవి 150వ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసింది.

చిరంజీవి సరసన నయనతార, అనుష్క, రెజీనా, నర్గీస్ ఫక్రీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ల తర్వాత కాజల్ అగర్వాల్ ఖరారైంది. సర్దార్ గబ్బర్ సింగ్‌లో తమ్ముడు సరసన నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం అన్నయ్య సరసన నటించేందుకు ముందుగా ఒప్పుకోలేదని, ఆపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  
 
ఇప్పటికే విలన్‌గా అంజల జావేరి భర్త తరుణ్ అరోరా ఎంపికవగా.. తాజాగా హీరోయిన్‌గా కాజల్‌ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ తమిళ మీడియాతో చెప్పిందట. దీంతో మెగాస్టార్‌తో మిత్రవింద నటించడం ఖాయమని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కాజల్ అగర్వాల్ దాదాపు మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని.. ఇందుకు చెర్రీ ఓకే చెప్పేశాడని సమాచారం. 
 
ఇకపోతే చెర్రీతో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాల్లో నటించిన కాజల్, మరో మెగా హీరో అల్లు అర్జున్‌తో ఆర్య-2, ఎవడులో గెస్ట్‌ రోల్ చేసింది. ఇక పవర్‌స్టార్‌తోనూ "సర్దార్ గబ్బర్‌సింగ్''లో మెరిసింది. మెగా హీరోయిన్ బ్రాండ్‌ను నిలబెట్టుకుంది. ఇక మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ 150వ సినిమాలో నటిస్తే తనయుడితో నటించి తండ్రితో జోడీ కట్టిన రెండో హీరోయిన్‌గా కాజల్ రికార్డు సొంతం చేసుకోవచ్చు. గతంలో అతిలోక సుందరి శ్రీదేవి అక్కినేని తండ్రి, కొడుకులతో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
 
ఇక కాజల్ అగర్వాల్ ఆగస్టు మూడో వారంలో చిరంజీవి కత్తి రీమేక్ షూటింగ్‌లో పాల్గొంటుంది. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మెగాస్టార్ 150వ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక మూడో షెడ్యూల్ హైదరాబాదులో త్వరలో ప్రారంభం కానుంది. చెర్రీ ఈ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments