Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకోసం నన్ను ట్రై చేశారు.. కానీ.. ఇష్టం లేక నో చెప్పా: శ్రీరెడ్డి (video)

Webdunia
మంగళవారం, 21 జులై 2020 (16:07 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ అంటే గిట్టని నటీమణుల్లో శ్రీరెడ్డి ఒకరు. మెగా ఫ్యామిలీ కారణంగా ఆమె హైదరాబాద్ వదిలి చెన్నైకు వచ్చి సెటిల్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. పైగా, ఈమె పవన్‌కు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారికి మద్దతు ఇస్తుంటారు. అలా టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు కూడా తన సంఘీభావాన్ని, మద్దతును తెలిపారు. 
 
ఈ క్రమంలో పవన్‌ను లక్ష్యంగా చేసుకుని వర్మ "పవర్ స్టార్" పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అచ్చం పవన్‌ను పోలిన డూప్ నటీనటులను ఎంపిక చేసుకున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటను కూడా వర్మ తాజాగా విడుదల చేశారు. 
 
మరోవైపు, వర్మను టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ "పరాన్నాజీవి" పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవలం రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 
 
ఈ సినిమాకు సంబంధించిన తొలి పాటను కూడా విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక రకమైన ఉత్కంఠభరితమైన పరిస్థితి నెలకొందనే చెప్పుకోవాలి. 
 
అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. 'పరాన్నజీవి' చిత్రంలో శ్రీరెడ్డి కూడా నటించిందనేదే ఆ వార్త. ఈ అంశంపై ఆమె క్లారిటీ ఇస్తూ, ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని చెప్పింది. 
 
రామ్ గోపాల్ వర్మ అంటే తనకు చాలా ఇష్టమని... అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా తీస్తున్న సినిమాలో ఎలా నటిస్తానని ప్రశ్నించింది. ఈ సినిమా కోసం తనను సంప్రదించిన మాట వాస్తవమేనని... కానీ, వర్మకు వ్యతిరేకంగా తాను నటించనని చెప్పింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments