Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'అలిమేలుమంగ వెంకటరమణ' ఆఫర్‌ను తిరస్కరించిన సాయిపల్లవి

Advertiesment
'అలిమేలుమంగ వెంకటరమణ' ఆఫర్‌ను తిరస్కరించిన సాయిపల్లవి
, గురువారం, 4 జూన్ 2020 (18:09 IST)
హీరోయిన్ సాయి పల్లవి. తమిళ పిల్ల అయినప్పటికీ.. అచ్చం తెలుగు అమ్మాయిలాగే ఉంటుంది. పైగా, 'ఫిదా' చిత్రంలో తెలంగాణ అమ్మాయిగా, తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ అద్భుతంగా నటించింది. ఈ చిత్రంలో ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. 
 
అయితే, సాయిపల్లవి మిగిలిన హీరోయిన్లలా కాదు. తనకు డబ్బు ముఖ్యంకాదనీ, పాత్ర ముఖ్యమని పలుమార్లు స్పష్టం చేసింది. చేతల ద్వారా కూడా నిరూపించింది. ఇపుడు మరోమారు ఓ మంచి ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. అదీ ఓ స్టార్ డైరెక్టర్ ఇచ్చిన బెస్ట్ ఆఫర్‌ కావడం గమనార్హం. 
 
ప్రముఖ దర్శకుడు తేజ త్వరలో యాక్షన్ హీరో గోపీచంద్‌తో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. ఈ చిత్రం పేరు కూడా 'అలిమేలుమంగ వెంకటరమణ'గా రిజిస్టర్ చేయించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు తేజ... సాయిపల్లవిని తేజ సంప్రదించాడట. అయితే, తేజ చెప్పిన పాత్ర, కథ ఆమెకు నచ్చకపోవడంతో అక్కడే, అపుడే సున్నితంగా తిరస్కరించిందట. దీంతో ఈ పాత్రకు ఇప్పుడు అనుష్కను సంప్రదిస్తున్నట్టు సమాచారం. అయితే, గోపీచంద్ సరసన ఇపుడు అనుష్క నటిస్తుందా లేదా అన్నది తేలాల్సివుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీరా చోప్రాకు బెదిరింపులు... హైదరాబాద్‌లో ఎఫ్ఐఆర్