Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాయిలెట్, రింగ్‌లతో మహేష్‌బాబు స్పైడర్... వారికి పరాభవం తప్పదా...?

మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి జూన్ 23వ తేదీనాటికే విడుదలకు సిద్ధం కావలసిన ఈ చిత్

Webdunia
గురువారం, 4 మే 2017 (11:31 IST)
మహేష్, మురుగదాస్ కాంబినేషన్‌లో 110 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రంపై ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి జూన్ 23వ తేదీనాటికే విడుదలకు సిద్ధం కావలసిన ఈ చిత్రం మే ఆఖరు వరకు షూటింగ్ జరగనున్న కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం విడుదలను ఆగస్టు 11కు వాయిదా వేసారు. 
 
ఈ చిత్రంతో తొలిసారిగా నేరుగా తమిళ మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాడు. కాగా ఈ చిత్ర బృందానికి ఆదిలోనే హంసపాదులా అపశకునం ఎదురుకానుంది. ఆగస్టు 11నే అక్షయ్ కుమార్ 'టాయిలెట్', షారుఖ్ ఖాన్ 'ది రింగ్' చిత్రాలు విడుదల కానున్నాయి. ఈ బాలీవుడ్ హీరోలిద్దరికీ దక్షిణాదిన సైతం మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వీరి సినిమాల కారణంగా మహేష్ స్పైడర్‌కు థియేటర్ల కొరత ఏర్పడితే అది తొలి వారం కలెక్షన్లపై తీవ్రప్రభావం చూపే అవకాశముందంటున్నారు మార్కెట్ నిపుణులు. కానీ మహేష్ అభిమానులు మాత్రం తమ హీరో చిత్రం వసూళ్లకు ఎలాంటి ఢోకా ఉండదని, అక్షయ్, షారుఖ్‌ల చిత్రాల గురించి అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇప్పటికే పోయినేడాది రిలీజైన బ్రహ్మోత్సవంతో దూకుడు తగ్గించిన మహేష్‌కు ఈ స్పైడర్ చిత్రం ఎంతో కీలకమన్న విషయం తెలిసిందే. మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన రకుల్‌‍ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాని, ఖుషీ, పులి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్‌జె సూర్య ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసిన కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments