Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి.. పిచ్చికుక్కలకున్న విలువ తెలంగాణ బిడ్డలకు లేదా?

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. హీరో నాగార్జున సతీమణి అమలను టార్గెట్ చేశారు. సినీనటుడు నాగార్జున భార్య అమలకు జూబ్లీహిల్స్‌లో అతి ఖరీదైన ప్రాంతంలో పిచ్చికుక్కలను పెంచుకునేందుకు మూడు

Webdunia
గురువారం, 4 మే 2017 (11:06 IST)
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. హీరో నాగార్జున సతీమణి అమలను టార్గెట్ చేశారు. సినీనటుడు నాగార్జున భార్య అమలకు జూబ్లీహిల్స్‌లో అతి ఖరీదైన ప్రాంతంలో పిచ్చికుక్కలను పెంచుకునేందుకు మూడు ఎకరాల స్థలం కేటాయించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. హైదరాబాద్‌లో ఆంధ్రా కుక్కలకు ఉన్న విలువ కూడా తెలంగాణ బిడ్డలకు లేదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
 
ఆంధ్రా వ్యక్తులైతేనే తమకు బాగా కమీషన్ ఇస్తారని వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆంధ్రా వ్యక్తులకు తెలంగాణ  సర్కారు పెద్దపీట వేస్తుందని ఆరోపించారు. ఓవైపు ఆంధ్రాలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే.. ఇక్కడ ఆంధ్ర వ్యక్తులపై రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. 
 
తెలంగాణ వస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయని ఆశ చూపించిన కేసీఆర్.. ఇప్పుడు ఆంధ్రావారికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ వాళ్లను అణగదొక్కేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం, ఐ.ఐ.టి.ఆర్‌కు కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈవోగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. సీఈవో పదవికి తెలంగాణలో టాలెంట్ ఉన్న వ్యక్తులే లేరా అని రేవంత్ రెడ్డి నిలదీశారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments