Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ‌తో శ్రుతి హాస‌న్ ఫిక్స్ అయిన‌ట్లే!

Webdunia
సోమవారం, 17 మే 2021 (18:49 IST)
Sruti (ig)
క‌రోనా మొద‌టి వేవ్ స‌మ‌యంలో విడుద‌లైన ర‌వితేజ `క్రాక్‌` మంచి విజ‌యాన్ని సాధించింది. అందులో శ్రుతిహాస‌న్ న‌టించింది. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ సినిమా స‌క్సెస్ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు గోపీచంద్‌. అయితే ఆ త‌ర్వాత బాల‌కృష్ణ‌ను కూడా క‌లిశారు. ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్లు అప్ప‌ట్లోనే తెలియ‌జేశారు. ఇది ఇప్ప‌టి వ‌ర్క‌వుట్ అయింది. నంద‌మూరి బాలకృష్ణ‌తో గోపీచంద్ సినిమా చేయ‌బోతున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య‌బాబు `అఖండ‌` సినిమాలో వున్నాడు. ఇంకా కొంత భాగం పూర్తి చేయాల్సి వుంది.
 
కాగా, తాజా స‌మాచారం ప్ర‌కారం బాల‌కృష్ణ‌తో జోడీ క‌ట్ట‌డానికి శ్రుతిహాస‌న్‌ను ప‌రిశీల‌న‌లో వున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలియ‌జేస్తుంది మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ బాలకృష్ణ ఇమేజ్ కు సరిపోయేలా ఓ చరిత్రకారుని కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించబోతున్నార‌ని తెలుస్తోంది.
 
పల్నాటి ప్రాంతానికి చెందిన ఆ చరిత్రకారుని కథకి బాలయ్య త‌గిన న్యాయం చేస్తాడ‌ని అంటున్నారు. ఈ సినిమాలో ఫ్లాష్‌బేక్ ఎపిసోడ్ కీల‌క‌మైంది. అందుకు శ్రుతిహాస‌న్ స‌రిపోతుంద‌ని అందుకే ఆమెను సంప్ర‌దించిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా క‌రుణిస్తే జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళనుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలన్నది దర్శకనిర్మాతల ప్లాన్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

పొలిటీషియన్స్‌తో పడుకోమని నా భర్త వేధిస్తున్నాడు: భార్య ఫిర్యాదు

LOC: పాదాల కింద పేలని గుండ్లు ఉంటాయనే భయంతో కాశ్మీర్ సరిహద్దు ప్రజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments