Webdunia - Bharat's app for daily news and videos

Install App

నో డౌట్... బ్రిటన్ ఆర్టిస్టుతో శృతిహాసన్ రొమాన్స్... ముంబై హోటల్‌లో డేటింగ్..

ఇటు తెలుగు, అటు తమిళంలోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సైతం తన హాట్ అందాలను ఆరబోసిన నటి శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెర అరంగేట్రం చేసిన ఈ భామ.. బిగ్ స్క్రీన్‌పై ఏమాత్రం హద్దుల

Webdunia
ఆదివారం, 26 ఫిబ్రవరి 2017 (11:39 IST)
ఇటు తెలుగు, అటు తమిళంలోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సైతం తన హాట్ అందాలను ఆరబోసిన నటి శృతిహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ కుమార్తెగా వెండితెర అరంగేట్రం చేసిన ఈ భామ.. బిగ్ స్క్రీన్‌పై ఏమాత్రం హద్దుల్లేకుండా రెచ్చిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ భామ ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్టు రూమర్లు చక్కర్లు కొట్టాయి. వీటిని శృతిహాసన్ తోసిపుచ్చింది. కానీ, ఇపుడు అడ్డంగా బుక్కైంది. బ్రిటిష్‌‌కు చెందిన ఇంగ్లీష్ థియేటర్ ఆర్టిస్టు మైఖేల్ కోర్సెల్‌తో తన ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్టు ఖరారైపోయింది. 
 
తాజాగా, మైఖేల్ ట్విట్టర్‌లో శ్రుతితో కలసి దిగిన ఓ చిత్రం హల్ చల్ చేస్తోంది. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా, శ్రుతి కోసమే ప్రత్యేకించి వచ్చిన మైఖేల్, ముంబైలో ఆమెతో కలసి గడిపినట్టు సమాచారం. ‘ఇండియాలో ఓ మంచి అమ్మాయితో చక్కటి సమయాన్ని గడిపాను. అందమైన స్నేహితుల బృందం ఇక్కడుంది. ఇండియా నాకు రెండో ఇల్లు’ అని వ్యాఖ్యానిస్తూ, మైఖేల్ ఈ ఫోటోను పోస్టు చేశాడు.
 
కాగా, బ్రిటిష్‌ ఆల్టర్నేటివ్‌ రాక్‌ బ్యాండ్‌‌లో ప్రదర్శన నిమిత్తం వెళ్లిన శ్రుతికి ఓ స్నేహితుడి ద్వారా మైఖేల్ పరిచయం కాగా, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్‌‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

Tenth class girl: పదో తరగతి అమ్మాయి ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments