Webdunia - Bharat's app for daily news and videos

Install App

విమానాశ్రయంలో శృతిహాసన్ వెంటపడిన ఆ వ్యక్తి ఎవరు?

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2023 (11:40 IST)
Shruthi haasan
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్‌కు విమానాశ్రయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయంలో ఆమెను ఓ వ్యక్తి అనుసరించాడు. మీ అభిమానినంటూ వెంబడించాడు. ఏకంగా ఎయిర్‌పోర్ట్‌ లోపలి నుంచి కారు ఎక్కే వరకు ఫాలో అయ్యాడు. దీంతో భయపడిన శ్రుతి అతడిని నిలదీయడంతో అక్కడి నుంచి జారుకొన్నాడు. తాజాగా ఈ విషయంపై ఆమె తన ఇన్‌స్టా చిట్‌చాట్‌లో మాట్లాడారు. అతనెవరో తనకు తెలియదని అన్నారు.
 
దీనిపై ఆమె స్పందిస్తూ, 'నేను ఎయిర్‌పోర్ట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి నా వెంట రావడం గమనించాను. ఫొటో కోసం అనుకున్నాను. అంతలో ఫొటోగ్రాఫర్‌ ఆమె పక్కకు వెళ్లి నిల్చొమని అతడికి చెప్పాడు. వాళ్లిద్దరూ స్నేహితులేమో అనుకున్నా. కానీ, అతడు నాకు చాలా దగ్గరగా రావడంతో అసౌకర్యంగా అనిపించింది. అందుకే వేగంగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాను. వ్యక్తిగత అంగరక్షకులను పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితాన్ని స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాను. అందుకే ఇప్పటి వరకూ బాడీ గార్డ్స్‌ను పెట్టుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ విషయంపై ఆలోచించాలేమో' అని శ్రుతి హాసన్‌ చెప్పారు. 
 
ఇకపోతే, తన సినిమాల విషయాలపై స్పందిస్తూ, ప్రస్తుతం సలార్ చిత్రంలో నటించానని త్వరలోనే విడుదలకానుందని చెప్పారు. ఆ తర్వాత నాని హీరోగా తెరెక్కుకుతున్న హాయ్ నాన్న చిత్రంలో నటిస్తున్నట్టు ఆమె వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

ఆపరేషన్ మహాదేవ్- ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టిన సైన్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments