డాకు మహారాజ్ తో సూపర్ స్టార్ తో ఛాన్స్ కొట్టేసిన శ్రద్దా శ్రీనాథ్

డీవీ
సోమవారం, 13 జనవరి 2025 (13:29 IST)
Shraddha Srinath
నందమూరి బాలక్రిష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా సక్సెస్ తో ఒక్కసారిగా శ్రద్దా శ్రీనాథ్ కు లక్ వరించింది. నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా జెర్సీలో మెప్పించిన శ్రద్దా శ్రీనాథ్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినా కొంత గేప్ తీసుకుంది. అందుకు కథల ఎంపికలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. అయితే తాను గ్లామర్ నటిగా కుదరదు, ఎక్స్ పోజింగ్ కు సూట్ కానని ఇటీవలే వెల్లడించింది.
 
డాకు మహారాజ్ లో సోదరిగా నటించిన కలెక్టర్ పాత్ర ధారి శ్రద్దా శ్రీనాథ్ నటనకు మంచి మార్కులు వచ్చాయి. అందులోనూ హిట్ కావడంతో వెంటనే తమిళదర్శకుడు నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ విజయం గురించి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌కు సీక్వెల్ ‘జైలర్‌ 2’ షూటింగ్ చేయబోతున్నారు.
 
త్వరలో సెట్ పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రద్దా శ్రీనాథ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తమన్నా, యోగిబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నట్లు తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రజనీ కాంత్ కూలీ సినిమా బిజీలో వున్నారు. త్వరలో జైలర్ 2 వివరాలు తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నరసాపురం - చెన్నై వందే భారత్ రైలు ప్రారంభం ... 17 నుంచి పూర్తి సేవలు

ఆలస్యంగా నడుస్తున్న ఇండిగో విమానాలు: పరుపుతో సహా విమానాశ్రయానికి ప్రయాణికుడు (video)

బ్యాంకు ఏజెంట్ దారుణ హత్య... గోనె సంచిలో కట్టి.. కారులో బంధించి నిప్పంటించారు..

Orvakal: ఫార్మాస్యూటికల్ హబ్‌గా అభివృద్ధి చెందుతోన్న ఓర్వకల్

రోడ్డు దాటుతుండగా కారు ఢీ కొట్టింది.. వైద్య విద్యార్థిని మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments