Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో'లో ప్ర‌భాస్ పాత్ర ఏంటో తెలిస్తే మీరు షాకవుతారంతే...

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల

Webdunia
శనివారం, 11 ఆగస్టు 2018 (20:11 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ సాహో. ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. యు.వి. క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రూపొందుతోన్న ఈ సినిమా దాదాపు 150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోంది. విదేశాల్లో ఇటీవ‌ల చిత్రీక‌రించిన యాక్ష‌న్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తాయ‌ట‌. ఇక క‌థ విష‌యానికి వ‌స్తే... ఆడియ‌న్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఉంటుంద‌ని తెలిసింది.
 
ప్ర‌భాస్ పాత్ర గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే.. ఈ చిత్రంలో ప్ర‌భాస్ అంతర్జాతీయ వజ్రాల దొంగగా నటిస్తున్నారని ఆయన కోసం ఇంటర్ పోల్ అధికారులు తీవ్రంగా గాలిస్తుంటారని ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు చిత్రానికి హైలైట్ కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. 
 
వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌ధ‌మార్థంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తోన్న మూవీ క‌నుక దీనిపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి.. సాహో ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments