Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - త్రివిక్రమ్ మూవీ గురించి షాకింగ్ న్యూస్

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (22:52 IST)
ఎన్టీఆర్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నట్టు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్... ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు. మే నెలలో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ భారీ చిత్రానికి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కథను మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ ఫిల్మ్ మంత్రి గారి వియ్యంకుడు ఇన్స్పిరేషన్‌తో త్రివిక్రమ్ రెడీ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 
 
నందమూరి ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ న్యూసే. మేటర్ ఏంటంటే... త్రివిక్రమ్ ఈ మధ్య కథల విషయంలో పాత సినిమాలను నమ్ముకుంటున్నారు. అఆ సినిమాని విజయనిర్మల తెరకెక్కించిన మీనా సినిమా స్పూర్తితో తయారు చేసారు. 
 
అలాగే అల.. వైకుంఠపురములో సినిమా కథని ఇంటిగుట్టు సినిమా స్పూర్తితో తయారుచేసారని వార్తలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ సినిమా కథకి మంత్రి గారి వియ్యంకుడు స్పూర్తితో రాయడం అనేది నిజమే అనుకున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి ఎక్కువుగా వార్తలు వస్తుండడంతో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 
 
ఇంతకీ ఏమని చెప్పారంటే.. ప్రచారంలో ఉన్నట్టు త్రివిక్రమ్ మంత్రి గారి వియ్యంకుడు సినిమా స్పూర్తితో ఈ సినిమా కథను రెడీ చేయడం లేదు. 
 
ప్రెష్ స్టోరీ రెడీ చేస్తున్నారు అని తెలియచేసారు. ఎన్టీఆర్ పాత్ర ఇప్పటివరకు రాని విధంగా సరికొత్తగా ఉంటుందని.. అలాగే స్టోరీ లైన్ కూడా చాలా వైవిధ్యంగా ఉంటుదని తెలిసింది. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలిసి అరవింద సమేత అనే సీరియస్ యాక్షన్ ఫిల్మ్ తీసారు. అందుచేత ఈసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనుకుంటున్నారు. ఈ సమ్మర్లో షూటింగ్ స్టార్ట్ చేసి 2021 సమ్మర్లో సినిమాని రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments