'పొన్నియిన్ సెల్వన్'లో అజిత్ భార్య.. రీ ఎంట్రీ ఖరారేనా?

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (19:04 IST)
Shalini
ప్రముఖ దర్శకుడు మణిరత్నం చోళుల కాలానికి సంబంధించిన కథ ఆధారంగా 'పొన్నియిన్ సెల్వన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌, మణిరత్నం సంయుక్తంగా నిర్మిస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' సినిమా మల్టీస్టారర్‌‌గా అలరించనుంది. రెండు భాగాలుగా విడుదల చేయనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ షూటింగ్‌ పూర్తయినట్టు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 
 
'పొన్నియిన్ సెల్వన్' మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ప్రభు, ప్రకాష్‌రాజ్, శరత్ కుమార్, పార్తీబన్, ఐశ్వర్యరాయ్, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్‌ అప్‌డేట్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది.
 
భారీ తారాగణంతో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో స్టార్ హీరో అజిత్ భార్య షాలినీ అతిథి పాత్రలో కనిపించనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన షాలినీ, మణిరత్నం దర్శకత్వం వహించిన 'సఖి' సినిమాతో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
 
అజిత్‌తో పెండ్లి తరువాత షాలినీ సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. మళ్లీ ఇన్ని సంవత్సరాలకు షాలినీ 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో అతిథి పాత్రలో కనిపించనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం: నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఏపీలో భారీ వర్షాలు

బ్లూ డ్రమ్ మర్డర్ కేసు : భర్త హత్య కేసు.. జైలులో భార్య... పండంటి బిడ్డకు జన్మ

బైకును ఢీకొన్న ట్రాక్టర్-రోడ్డు ప్రమాదంలో నవ వధువు మృతి

న్యాయవాదిపై కేసు: ఇద్దరి మధ్య సమ్మతంతోనే శృంగారం.. అది అత్యాచారం కాదు.. సుప్రీంకోర్టు

జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఏపీలో తీవ్రమైన చలిగాలులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments