Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్‌తో అది నిజమైతే బావుండు: సయీ మంజ్రేకర్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (17:10 IST)
Saiee manjrekar, major
బాలీవుడ్ న‌టి సయీ మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ `దబాంగ్-3`లో హీరోయిన్‌గా మెరిసింది. ఒక్క బాలీవుడ్‌కేకాదు తెలుగులోకూడా న‌టిస్తుంది. లేటెస్ట్‌గా `మేజర్`, `గని` సినిమాల్లో న‌టించింది. వీటికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను త‌న సోష‌ల్‌మీడియాలో పెట్టుకుంది.

అలాగే త‌న కిష్ట‌మైన హీరోతో న‌టిస్తే దానిని మ‌రింత జాగ్ర‌త్త చేసుకుంటానంటోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ న‌టుల గురించి చెబుతూ, `అల వైకుంఠపురములో..` సినిమా చూశా. అందులో బన్నీ  డ్యాన్స్‌, నటన చూసి ఫిదా అయిపోయా. ఆయనతో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని సయీ తెలిపింది.

అల్లు అర్జున్‌తో కొత్త‌త‌రం నాయిక‌లు న‌టించాల‌నుంద‌ని అంటుండం కామ‌నే. కానీ స‌యీ మాత్రం ఖ‌చ్చితంగా నా క‌ల నిజ‌మైతే బాగుంటుంద‌ని తెలియ‌జేస్తుంది. తెలుగు హీరోలలో నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  అంటే చాలా ఇష్టం. ఆయనతో కలిసి నేను నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే బాగుంటుంది` అని వెల్ల‌డించింది.

ఇక మేజ‌ర్ సినిమా గురించి చెబుతూ.. భార‌త‌దేశం గ‌ర్వించ‌ద‌గ్గ చిత్రం అవుతుంద‌నే ధీమా వ్య‌క్తం చేస్తుంది. మ‌హేష్‌బాబు ప్రొడ‌క్ష‌న్ హౌస్ నుంచి వ‌స్తున్న మేజ‌ర్ సినిమాకు అడ‌వి శేషు క‌థానాయ‌కుడిగా న‌టించాడు. త్వ‌ర‌లో విడుద‌ల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments