Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ మూవీలో సంజయ్ దత్, పాత్ర ఏంటో తెలుసా..?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (20:53 IST)
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్ఆర్ఆర్ ఇప్పటివరకు 75 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. పూణెలో ప్లాన్ చేసిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తి కానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 
 
ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సమ్మర్ లోనే సెట్స్ పైకి వెళ్లింది కానీ... కరోనా వలన ప్లాన్ మారింది. ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అది ఏంటంటే.... ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని. 
 
ఇంతకీ పాత్ర ఏంటంటే... రాజకీయ నాయకుడి పాత్ర అని సమాచారం. అలాగే ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయ నాయకుడి పాత్రే అంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ సినిమా పొలిటికల్ మూవీ అంటూ ప్రచారం జరిగింది. అయితే... ఎన్టీఆర్ ఈ టైమ్ లో పొలిటికల్ మూవీ చేయరు. అందుచేత ప్రచారంలో ఉన్న ఈ వార్త గాసిప్ అని నందమూరి అభిమానులతో పాటు చాలా మంది అలాగే అనుకున్నారు.
 
ప్రస్తుతం వస్తున్న వార్తలు చూస్తుంటే... ఇది పొలిటికల్ మూవీనే అనిపిస్తుంది. ఎన్టీఆర్ - సంజయ్ దత్ పైన సన్నివేశాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి అంటున్నారు. ఇదే కనుక నిజమైతే... ఎన్టీఆర్ అభిమానులకు పండగే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments