Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా హనీమూన్ ఎక్కడంటే : నోరు విప్పిన హీరోయిన్ సమంత

టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత త్వరలోనే హీరో అక్కినేని నాగార్జున కోడలుకానుంది. ఈ టాలీవుడ్ 'మన్మథుడు' పెద్ద కుమారుడు, యువ హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకోనుంది. వీరి వివాహం వచ్చే అక్టోబరులో జరుగను

Webdunia
గురువారం, 15 జూన్ 2017 (17:02 IST)
టాలీవుడ్ అగ్రహీరోయిన్ సమంత త్వరలోనే హీరో అక్కినేని నాగార్జున కోడలుకానుంది. ఈ టాలీవుడ్ 'మన్మథుడు' పెద్ద కుమారుడు, యువ హీరో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకోనుంది. వీరి వివాహం వచ్చే అక్టోబరులో జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లో హీరోయిన్ సమంత సందడి చేశారు. ఓ బ్యూటీక్లీనిక్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. త్వరలో పెళ్లికూతురు కాబోతున్న ఆమె మీడియాతో ముచ్చటించారు. పెళ్లి గురించి, హానీమూన్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతానికి తమ హనీమూన్‌కు ఎలాంటి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేదని, ఇప్పటికిపుడైతే అలాంటి ప్లాన్స్ ఏవీ లేవన్నారు. 
 
ఇదిలావుండగా, నాగ చైతన్య 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమాలో రకుల్‌ను తీసుకోవడానికి ముందు సమంతాను అనుకున్నారు. అప్పటికే చైతూ... సమంతాల ప్రేమ వ్యవహారం బయటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ జంట తెరపై కనిపిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎందువల్లనో సమంతాను కాకుండా రకుల్‌కి ఛాన్స్ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments