Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత రెండో పెళ్లికి సిద్ధమవుతోందా? నిజమా?

Webdunia
శుక్రవారం, 9 సెప్టెంబరు 2022 (12:05 IST)
టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ టౌన్లలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలతో బిజీ బిజీ అయినా.. సోషల్ మీడియాకు దూరం అయ్యింది. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది. ప్రస్తుతం యశోద అప్డేట్‌తో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులను పలకరించింది.  
 
సమంత జూలై నెల చివరి వారంలో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమా షూటింగ్‌లో పాల్గొంది. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆరోగ్యం గురించి రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి.
 
కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి సమంత తల్లి రెండో వివాహం చేసుకోమని ఒత్తిడి తీసుకు రావడంతో సమంత గర్భసంచి తీయించుకోవడానికి సిద్ధమైందని అసలు తీయించుకుందని కూడా ప్రచారం చేశారు. దీంతో ఇటీవల సమంత మేనేజర్ మీడియాకు ఒక నోట్ రిలీజ్ చేస్తూ ఆమె అనారోగ్యంగా ఉందన్న వార్తలు నిజం కాదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆమె త్వరలోనే అన్ని పుకార్లకు బ్రేక్ వేస్తారని కూడా పేర్కొన్నారు.
 
అయితే అనూహ్యంగా గురువారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌లోని ఒక వేద పాఠశాలలో సమంత ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారని తెలుస్తోంది. ఈ ఫోటోలలో కొంత మంది పూజారులు అలాగే వేద పాఠశాల విద్యార్థులు కనిపిస్తుండగా వారి మధ్యలో సమంత కుర్చీలో కూర్చొని కనిపిస్తుంది.
 
అయితే ఆమె రెండో పెళ్లి గురించి ఫేక్ న్యూస్ వైరల్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఏం తప్పు చేసిందని సమంతను ఈ విధంగా టార్గెట్ చేస్తున్నారని ఆమె ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
సమంత మనస్తత్వం దాచుకునే మనస్తత్వం కాదని ఏ పని చేసినా ముందుగానే హింట్ ఇస్తుందని అభిమానులు చెబుతున్నారు. సమంత వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయవద్దని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత నటించిన యశోద సినిమా నుంచి టీజర్ శుక్రవారం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments