Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samantha: ఇంకోసారి ప్రేమలో పడి ఆలోచనే సమంతకు లేదా? జెస్సీ రోల్ అంటే చాలా ఇష్టం

సెల్వి
బుధవారం, 5 మార్చి 2025 (14:58 IST)
టాలీవుడ్ హీరో నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి జీవితాన్ని గడుపుతున్న స్టార్ నటి సమంత, మైయోసైటిస్ అనే ఆరోగ్య సమస్యతో పోరాడాల్సి వచ్చింది. దీంతో కొద్దికాలం సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం కోలుకుని తన సినిమా కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టింది.
 
ఇదిలా ఉండగా, సమంత మళ్ళీ ప్రేమలో పడిందనే ఊహాగానాలు వచ్చాయి. ఈ పుకార్లపై సమంత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను మళ్ళీ ప్రేమలో పడటం గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది. 
 
ప్రేమ గురించి చర్చించడంలో తనకు ఆసక్తి లేదని, దానిని వ్యక్తిగత విషయంగా భావిస్తానని, దానిని తాను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానని సమంత చెప్పింది. ఆమె ప్రకటనలను బట్టి చూస్తే, సమంతకు ప్రస్తుతానికి మరో ప్రేమ సంబంధంలోకి ప్రవేశించే ఉద్దేశ్యం లేదని స్పష్టంగా తెలుస్తోంది.
 
ఇంకా ఓ ఇంటర్వ్యూలో తన తొలి చిత్రం గురించి సమంత మాట్లాడుతూ.. ఆ మూవీలోని ప్రతి షాట్ తన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పింది. ఈ మూవీలో జెస్సీ పాత్రలో కార్తీక్‌ను గేట్ దగ్గర కలిసే సీనే తన ఫస్ట్ షాట్ అని, అది తనకు జీవితాంతం గుర్తిండిపోతుందని అన్నారు. గౌతమ్ మీనన్ ఆ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారని, ఆయనతో పని చేయడం మంచి అనుభూతినిచ్చిందని సమంత తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments