Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుక్కు సినిమాలో చెర్రీ-సమ్మూ వెరైటీ రోల్స్.. సమంత రోల్ అది కాదని.. యూనిట్ ప్రకటన

రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులో గ్లామర్ బ్యూటీ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జగపతి

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:03 IST)
రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టులో గ్లామర్ బ్యూటీ సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జగపతిబాబు, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంతపై కొన్ని సీన్స్ తెరకెక్కుతున్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాలలో జరుగుతోంది. ఇందులో చెర్రీ చెవిటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సమంత మూగమ్మాయిగా నటిస్తుందని ఫిలిమ్ నగర్  వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. 
 
ఈ వార్తలపై సినీ టీమ్ ఓ ప్రకటన చేసింది. సమంత మూగమ్మాయిగా నటిస్తుందనే వార్త అవాస్తవం అంటూ మేకర్స్ ట్వీట్ చేశారు. చెర్రీకి సంబంధించి మాత్రం యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చెర్రీ చెవిటీ వ్యక్తిగానే కనిపిస్తాడా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. 80టీస్ నాటి గ్రామీణ నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథగా సుకుమార్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అనసూయ కీలక పాత్ర పోషించడంతో పాటు ఐటమ్ సాంగ్ కూడా చేస్తుందని టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏఐ ఫర్ ఆంధ్రా పోలీస్ హ్యాకథాన్-2025లో రెండో స్థానంలో నిల్చిన క్వాడ్రిక్ ఐటీ

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments