Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమమ్‌లో సమంత అలా మిస్సయ్యిందన్నమాట...

అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ''ప్రేమమ్‌'' మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్

Webdunia
బుధవారం, 12 అక్టోబరు 2016 (13:33 IST)
అక్కినేని నాగాచైతన్య తాజా సినిమా ''ప్రేమమ్‌'' మంచి కలెక్షన్లు రాబడుతోంది. మలయాళం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావడం కలిసి వచ్చింది. దీంతో చైతూ సినిమాల పరంగా కలెక్షన్ల విషయంలో ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదుచేస్తోంది. ఒరిజినల్‌ ''ప్రేమమ్‌''ను యధాతథంగా దించేయకుండా తెలుగు నేటివిటీకి తగ్గట్టు అవసరమైన మార్పులు చేశాడు దర్శకుడు చందూ మొండేటి.

ఈ నేపథ్యంలో సినిమాలో హీరోకు ఉన్న ''ఎస్''’ సెంటిమెంట్‌ సమంత గురించే అంటూ కథనాలు మొదలయ్యాయి. మరోపక్క ఈ సినిమాలో హీరోయిన్‌‌గా సమంతా కూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది కదా అని అభిమానులు ఫీలవుతున్నారు. 
 
అదే ప్రశ్నను నాగచైతన్యను అడిగితే….అది నా పరిధిలోని అంశం కాదని చెప్పుకొచ్చాడు. హీరోయిన్స్ సెలక్షన్స్‌లో నేను అస్సలు ఎంటర్ కానని...దర్శకనిర్మాతలే ఆ విషయాలు చూసుకుంటారని చెప్పాడు. అయితే ప్రేక్షకులు మాత్రం సినిమాలో ఎలాగూ ''ఎస్'' పేరుతో అమ్మాయే తనకు భార్య అవుతుందన్న సెంటిమెంట్ డైలాగ్ కూడా పెట్టేశారు, కాబట్టి సమంతా కూడా యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండేదని అనుకుంటున్నారు.
 
ఈ సినిమాలో హీరో ఓ రొమాంటిక్ గాయ్.. తన చిన్నప్పుడు తనకు ''ఎస్'' అనే పేరు కల వారే తన లైఫ్‌పార్ట్‌నర్ అవుతారని చెబుతుంటాడు.. అందుకే హీరోయిన్స్ ముగ్గురి పేర్లు కూడా సుమ, సరిత, సింధు అని పెట్టించాడు. ఇక రియల్ లైఫ్‌లో సమంత పేరు కూడా 'ఎస్' తోనే స్టార్ట్ అవుతుంది కదా ఆ ఉద్దేశంతో చైతు కావాలనే ఈ సెంటిమెంట్ సినిమాలో పెట్టించాడు అంటున్నారు సినీ జనాలు.

అందుకే ప్రేమంలో సమంత కనిపించదు కాని చాలా చోట్ల వినిపిస్తుంది. నిజానికి ఈ సినిమా చివరలో వచ్చే మూడో హీరోయిన్‌ మడోన్నా సెబాస్టియన్ క్యారెక్టర్‌ని సమంతాతో చేయించాలని దర్శకుడు అనుకున్నారట. అయితే ఒరిజినల్‌లో చేసిన మడోన్నా అయితే బాగుంటుందన్న ఫైనల్ డెసిషన్‌కి అందరూ ఓకే చెప్పారట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంబులెన్స్‌కు దారివ్వని కారు డ్రైవర్.. రూ.2.5 లక్షల అపరాధం.. లైసెన్స్ రద్దు.. (Video)

'విశ్వ సుందరి'గా డెన్మార్క్ అందాల భామ

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

తర్వాతి కథనం
Show comments